చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి Mi Polarised Square Sunglassesను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను కంపెనీ రూ.899గా నిర్ణయించింది. ఇప్పటికే ఇవి దేశీయంగా పలు స్టోర్లలో లభ్యమవుతున్నాయి. ఈ గ్లాసెస్ రెండు వేరియంట్లలో వచ్చాయి. బ్లూ అండ్ గ్రే కలర్స్ లో ఇండియాలో ఇవి లభ్యమవుతున్నాయి. ఈ Mi Sunglasses మొత్తం పోలరైజ్ డ్ లెన్స్ తో వచ్చాయి. యూజర్లకు గ్రేట్ విజువల్ క్లారిటీ ని ఈ గ్లాసెస్ అందిస్తుందని షియోమి క్లయిమ్ చేసింది.
Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్‌గ్లాసెస్ ఫీచర్లు
Mi పోలరైజ్డ్ స్క్వేర్ సన్ గ్లాసెస్ TAC పోలరైజ్డ్ లెన్స్ తో వస్తుంది. O6 లేయర్డ్ లెన్స్ టెక్నాలజీతో మరియు కాంతి తొలగింపులతో వస్తుంది.పోలరైజ్ లైట్ మరియు హానికరమైన UV కిరణాలను మనిషి కన్నుకు చేరుకుండా అడ్డుకుంటుంది. పోలరైజ్డ్ లెన్స్ దృశ్య స్పష్టతను మరింతగా పెంచుతుంది కంటి మీద ఒత్తిని తగ్గిస్తుంది.Mi Polarised Square Sunglasses మొత్తం మీద UVA, UVB, UVC Rays మీద పోరాటం చేసి కళ్లను కాపాడుతాయి. దాదాపు 400 నానోమీటర్ల వరకు కళ్ళకు 100 శాతం రక్షణను ఇస్తాయని షియోమి తెలిపింది.
6 నెలల వారంటీ
Mi Polarised Square Sunglasses కంటికి అనువైన TR90 ఫ్రేములతో వచ్చాయి.ఈ సన్ గ్లాసెస్ యొక్క ఫ్రేమ్ లు చాలా తేలికగా ఉండి మంచి మన్నికైనవిగా ఉంటాయి. ధరించినప్పుడు చాలా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. వీటి బరువు 18g గ్రాములు ఉంటుంది. ఈ గ్లాసెస్ ను ఎవరైనా ధరించవచ్చు. 6 నెలల వారంటీతో ఇవి అందుబాటులో ఉన్నాయి.
అధికారిక వెబ్ సైట్ ద్వారా..
ఆసక్తిగల కొనుగోలుదారులు Mi.com, Xiaomi ఇండియా అధికారిక వెబ్సైట్ నుండి సన్ గ్లాసెస్ కొనుగోలు చేయవచ్చు.ఈ ఉత్పత్తులతో పాటు ఇతర రకాల ఉత్పత్తులు కూడా Mi.comలో అందుబాటులో ఉన్నాయి. లైఫ్ స్టైల్ ఉత్పత్తులు, బ్యాక్ పాక్స్, MI బూట్లు,Mi ఎయిర్ పాప్ ,Mi ఫోకస్ క్యూబ్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా కంపెనీ విక్రయిస్తోంది.
గూగుల్ గ్లాస్ 2
ఇదిలా ఉంటే గూగుల్ కూడా తన గూగుల్ గ్లాస్ 2 గ్లాసెస్‌కు గాను ఎంటర్ ప్రైజ్ ఎడిషన్ వేరియెంట్‌ను విడుదల చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ ఎక్స్ఆర్1 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల డివైస్ ప్రదర్శన గత గ్లాస్ వేరియెంట్ల కన్నా మెరుగ్గా ఉంటుంది. అలాగే కెమెరా ప్రదర్శన కూడా మెరుగ్గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఈ గ్లాస్ వేరియెంట్లో సపోర్ట్‌ను అందిస్తున్నారు.
ధర
అలాగే ఈ గ్లాస్‌కు యూఎస్బీ టైప్ సి పోర్టును ఏర్పాటు చేశారు. ఇక గతంలో వచ్చిన గూగుల్ గ్లాస్ వేరియెంట్ల కన్నా గ్లాస్ 2 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వేరియెంట్ మరింత మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. కాగా ఈ కొత్త వేరియెంట్ 999 అమెరికన్ డాలర్ల ధరకు (దాదాపుగా రూ.69,660) కేవలం ఎంటర్ప్రైజ్ బిజినెస్ యాజమాన్యాలకు మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నది..!
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ షియోమి ఎంఠసనౠగà±à°²à°¾à°¸à±†à°¸à± చైనా ఇండియా