బంగారం కొనాలనుకుంటే మీరు దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా టెక్ గెయింట్ దిగ్గజం గూగుల్ పే కొత్త సర్వీసులను లాంచ్ చేయబోతోంది. డిజిటల్ పేమెంట్ 'గూగుల్ పే' ద్వారా ఇకపై మీరు బంగారం కొనుగోలు చేయవచ్చు. ఫోన్ పే, పేటీఎంల వలె గూగుల్ పే ద్వారా 99.99% స్వచ్ఛత కలిగిన 24 కేరట్ల బంగారం కొనుగోలు చేయవచ్చు. మనం బంగారం కొనుగోలు చేస్తే అది నేరుగా ఇంటికి వస్తుంది. ఈ డిజిటల్ పేమెంట్ ఫాం ద్వారా మీరు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.
బంగారం కొనుగోలు, అమ్మకం కోసం గూగుల్ పే 'గోల్డ్ అకౌంట్'ను తీసుకు రానుంది. ఇందులోని గోల్డ్ అకౌంట్‌కు సబ్ స్క్రైబ్ కావాలి. ఇది గోల్డుతో లింక్ అయ్యే సేవింగ్స్ స్కీం. ప్రస్తుత మార్కెట్ ప్రకారం బంగాన్ని కొనుక్కోవడంతో పాటు దానిని వర్చువల్‌గా అట్టిపెట్టుకొని అవసరమైనప్పుడు గోల్డ్ కాయిన్లుగా లేదా నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. ఈ సర్వీసులు ఎంఎంటీసీ సారథ్యంలో నడుస్తాయి. ఈ సర్వీసులు లాంచ్ చేసేందుకు గోల్డ్ రిఫైనరీ ఎంఎంటీసీ - పీఏఎంపీతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. గోల్డ్ అకౌంట్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే యూజర్లు కేవైసీ నిబంధనలు పూర్తి చేయాలి. మీ వ్యాలెట్ నుంచి మీరు మీ అన్ని లావాదేవీలను చూసుకోవచ్చు.
గూగుల్ పే సాయంతో మీరు ఎంఎంటీసీ - పీఏఎంపీ ఇండియా ప్రయివేట్ లిమిటెండ్ నుంచి డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవచ్చు. గూగుల్ పేలో ప్రస్తుత మార్కెట్ బంగారం కొనుగోలు ధరను, పన్నుతో కలిపి చూపిస్తుంది. అక్కడ చూపించే ధర మీరు కొనుగోలు ప్రారంభించిన తర్వాత 5 నిమిషాల వరకు లాక్ చేయబడుతుంది. సాధారణంగా మీ వాలెట్ మీ సిమ్ కార్డుతో, పోన్ నెంబర్‌తో లింక్ చేయబడి ఉంటుంది. మీరు సిమ్ లేదా ఫోన్ నెంబర్ మార్చినప్పుడు మీ ఖాతాకు యాక్సెస్‌ను పునరుద్ధరించేందుకు మీ గుర్తింపును ధృవీకరించవలసి ఉంటుంది. సేవా నిబంధనలు లేదా వినియోగదారుల విధానాలు ఉల్లంఘిస్తే మీ ఖాతా యాక్సెస్‌ను బ్లాక్ చేయవచ్చు.
దీంతో పాటు నిర్ణీత అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే గూగుల్ పే ఆటోమేటిక్‌గా మిమ్మల్ని సైనౌట్ చేస్తుంది. సిమ్ లేదా ఫోన్ నెంబర్ మార్చి ఉంటే మీ గోల్డ్ వాలెట్ వాలెట్‌ను తాత్కాలికంగా లాక్ చేయడం ద్వారా బంగారాన్ని భద్రంగా ఉంచుంది. గూగుల్ పే యాక్సెస్‌లో మార్పును నిర్ధారించే స్క్రీన్ కనిపిస్తుంది. అందులో 'కంటిన్యూ'ను ప్రెస్ చేయాలి. ఓపెన్ చేస్తే గూగుల్ ఫారం సర్వే వస్తుంది. దానిని పూర్తి చేయాలి. ఆ తర్వాత మీ యాక్సెస్‌ను నిర్ధారించుకొని మీ ఫోన్ నెంబర్‌ను అప్ డేట్ చేస్తుంది. ఈ అప్ డేట్ పూర్తయ్యేందుకు రెండు రోజులు పట్టవచ్చు.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ గూగà±à°²à± గూగà±à°²à± పే గూగà±à°²à± పే గోలà±à°¡à± అకౌంటà±