ఇప్పటిదాకా ఎవరి అకౌంట్లో అయినా డబ్బులు వేయాలంటే వారి పర్మిషన్ అవసరం లేకుండానే వేసేవారే. అయితే ముందు ముందు అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎవరి అకౌంట్ లో అయినా డబ్బులు వెయ్యాలంటే మాత్రం ఆ ఖాతాదారుడి(అకౌంట్ యజమాని) పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఇప్పటికే వెల్లడించినా లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం లేఖ రాసింది.
ఎవరి అకౌంట్‌లోనైనా అమౌంట్ క్రెడిట్ అయితే వారికి తెలిసి జరగాలని, తమ అకౌంట్‌లోకి ట్రాన్సాక్షన్ తిరస్కరించాలా లేదా అనుమతించాలా హక్కు అకౌంట్ హోల్డర్ కలిగి ఉండేలా నిబంధనలు ఉండాలని, దీనిపై అభిప్రాయం తెలపాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ చేయాలంటే ఆ ఖాతాదారుడి అనుమతి సైతం తీసుకొనే విధానాన్ని బ్యాంకులు త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
కొత్తగా తీసుకుని రాబోతున్న విధానంలో ఎవరైనా ఏదైనా అకౌంట్ లో డబ్బులు జమ చేయాలంటే ముందుగా సదరు ఖాతాదారుడికి నోటిఫై చేస్తారు. వారు అనుమతి ఇస్తేనే డబ్బులు డిపాజిట్ అవుతాయి. డబ్బులు వెయ్యడం వెయ్యించుకోకపోవడం అనేది ఆ ఖాతాదారుని ఇష్టం మేరకే జరుగుతుంది. లావాదేవీని అనుమతించడం/తిరస్కరించడం ఖాతాదారుడి అభీష్టానికే వదిలేయబడుతుందన్నారు. నగదు జమ విషయంలో అకౌంట్ ఓనర్ ఏది అనుకుంటే అదే జరిగేలా ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు తీసుకురాబోతున్నారు.
అయితే ఈ సేవలు అందరికీ అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సేవలు పొందేందుకు బ్యాంకులకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం ఖాతాదారుడికి తన అకౌంట్‌కు సంబంధించిన డిపాజిట్లపై ఎటువంటి నియంత్రణ లేదు. కేవలం అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఉంటే జమ చేయవచ్చు.
నోట్లరద్దు సమయంలో పలువురి ఖాతాల్లో వారికి తెలియకుండా అక్రమంగా నగదు చేరినట్లుగా ఆరోపణలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు దీనికోసం జన్ ధన్ ఖాతాలను ఎక్కువగా వినియోగించుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఖాతాదారులకు తెలియకుండానే వారి అకౌంట్లలో అమౌంట్ పడిపోయింది. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించినట్లు తెలుస్తోంది.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ ఆరà±â€Œà°¬à°¿à° మొబైలà±à°¸à± డిపాజిటà±à°¸à±