ప్రభుత్వరంగ బ్యాంక్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ వినియోగదారులకు వివిధ రకాల సేవలు అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ మనీ ట్రాన్సఫర్, చెక్‌బుక్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం ఇలా వివిధ రకాల సేవల్ని అందిస్తూ వస్తోంది. అలాగే ఏటీఎంల నుంచి క్యాష్ తీసుకునే వెసులుబాటు, క్యాష్ వేసే అవకాశాలను కూడా బ్యాంకు కల్పిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 50,000కు పైగా ఏటీఎం సెంటర్లు ఉన్నాయి. తమ బ్యాంకు కస్టమర్లు అందరికీ ఈ సేవలు ఉచితంగా అందిస్తోంది.
SBI క్లాసిక్ డెబిట్ కార్డు హోల్డర్ రోజుకు రూ.20,000 విత్ డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ కస్టమర్లే కాకుండా Maestro, Master Card, Cirrus, VISA, VISA Electronలతో ఇతర బ్యాంకులు జారీ చేసే కార్డ్ హోల్డర్స్ కూడా SBI ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఇంటర్నేషనల్ కార్డ్ హోల్డర్స్ కూడా SBI ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. రోజుకు మినిమం రూ.100 విత్ డ్రా చేయాల్సి ఉంటుంది.
SBI ఏటీఎం నుంచి కస్టమర్లు రోజుకు రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి రూ.10వేల చొప్పున తీసుకోవాలి. అంతకుముందు విత్ డ్రా అమౌంట్ రూ.40,000గా ఉండేది. ఆ తర్వాత దీనిని రూ.20వేలకు తగ్గించింది. కస్టమర్లు రోజుకు పాయింట్ ఆప్ సేల్స్ (POS), ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ పైన కార్డు ద్వారా రూ.50,000 వరకు ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు. దీనికి కనీస పరిమితి లేదు. కొన్ని రకాల కార్డుల ద్వారా ఏటీఎం నుంచి రోజుకు రూ.20,000 కన్నా ఎక్కువ మొత్తాన్ని కూడా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
క్యాష్ విత్ డ్రా మాత్రమే కాకుండా ఏటీఏం నుంచి ఇతర సేవలు కూడా పొందువచ్చు. కస్టమర్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. మినీ స్టేట్మెంట్ పొందవచ్చు. క్రెడిట్ కార్డు పేమెంట్స్ చేయవచ్చు. ఒక ఎస్బీఐ డెబిట్ కార్డు నుంచి మరో కార్డుకు డబ్బులు పంపించుకోవచ్చు. చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. బిల్లులు చెల్లించవచ్చు. మొబైల్ బ్యాంక్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. IMPS సర్వీస్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఎస్బీఐ కస్టమర్లు తమ ఏటీఎం కార్డులను ఇతర బ్యాంకుల్లో కూడా ఉపయోగించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం ఇండివిడ్యువల్స్‌కు నెలకు మెట్రో నగరాల్లో మూడు ట్రాన్సక్షన్లు, ఇతర నగరాల్లో 5 ట్రాన్సక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు.ఈ పరిమితిని మించిన అనంతరం SBI ట్యాక్స్ కలిపి కొంత మొత్తం వసూలు చేస్తుంది.
à°¸à±à°Ÿà±‡à°Ÿà± à°¬à±à°¯à°¾à°‚కౠఆఫౠఇండియా నెటౠబà±à°¯à°¾à°‚కింగౠఆనà±â€Œà°²à±ˆà°¨à± మనీ à°Ÿà±à°°à°¾à°¨à±à°¸à±â€Œà°«à°°à± మొబైలౠబà±à°¯à°¾à°‚కింగౠచెకà±â€Œà°¬à±à°•ౠవితౠడà±à°°à°¾