మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేశారా? లేదా? ఎందుకంటే ఇప్పటికీ 18 కోట్ల పాన్ కార్డులు ఆధార్ నంబర్‌తో లింక్ కాలేదని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. ఆధార్, పాన్ లింకేజ్‌కు లాస్ట్ ఇయరే టైమ్ అయిపోయింది. అయితే తర్వాత చాలాసార్లు ఆ గడువు పొడిగించారు. 2021 మార్చి 31 వరకు ఆధార్‌తో ఈ పాన్ కార్డులను అనుసంధానం చేసుకోవచ్చు. అప్పటికీ చేయకపోతే మాత్రం ఆ పాన్ కార్డు ఇక పని చేయదు. అసలు ఈ గొడవంతా ఎందుకు? సింపుల్‌గా ఆధార్, పాన్ లింకేజ్ చేసేస్తే పోలా అనుకుంటున్నారా? అయితే ఎలా చేయాలో చూసేయండి మరి.
\ఆధార్‌తో పాన్ లింకేజ్ ఇలా..
1) www.incometaxindiaefiling.gov.in లోకి వెళ్లండి. లేదంటే ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన http://incometaxindia.gov.in/Pages/default.aspx. హైపర్ లింక్‌ను క్లిక్ చేయండి.
2)వెబ్‌సైట్‌లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
3)ఇప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, అందులో ఉన్నట్లుగానే మీ పేరు ఎంటర్ చేయండి.
4) ఒక వేళ మీ ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్ కాకుండా ఇయర్ మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని టిక్ చేయండి.
5) క్యాప్చా కనిపిస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. (కంటి చూపు సరిగా కనిపించనవారికోసం కింద క్యాప్చా బదులుగా ఓటీపీ ఎంటర్ చేసే ఆప్షన్ కూడా ఉంది. కావాలంటే దాన్ని వాడుకోవచ్చు)
6) పేజీ దిగువన లింక్ ఆధార్ అని కనిపిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే చాలు. మీ ఆధార్, పాన్ లింకేజ్ పూర్తయినట్లే.
ఆధారà±â€Œ పానౠలింకేజà±â€Œ Aadhar pan linkage