ఆండ్రాయిడ్‌లో డునాట్ డిస్ట‌ర్బ్ సెట్టింగ్స్ క‌న్ఫిగ‌ర్ చేయ‌డం ఎలా?

ఈ రోజుల్లో అన‌వ‌స‌ర కాల్స్‌, మెసేజ్‌లు ఫోన్ వాడుతున్న ప్ర‌తి ఒక్క‌రికీ త‌ప్ప‌వు. ఇవి ఒక్కోసారి తీవ్ర స్థాయిలో ఉంటాయి. మ‌న‌ల్ని బాగా డిస్ట‌ర్బ్ చేస్తాయి. అయితే ఈ ఇబ్బందుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి మ‌న‌కు కొన్ని ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. కానీ వాటిని  ఎవ‌రూ ఎక్కువ‌గా వాడ‌రు. వాటిలో కీలక‌మైంది డునాట్ డిస్ట‌ర్బ్ స‌ర్వీస్‌. అన‌వ‌స‌ర కాల్స్‌, మెసేజ్‌లు రాకుండా ఈ ఫీచ‌ర్ నిరోధిస్తుంది. అయితే ఆండ్రాయిడ్‌లో డిఫాల్ట్‌గా ఉండే ఈ ఫీచ‌ర్‌ని ఉప‌యోగించుకోవ‌డం ఎలా? .. డునాట్ డిస్ట‌ర్బ్ ఫీచ‌ర్‌ని మ‌నం ఫోన్‌లో క‌న్ఫిగ‌ర్ చేయ‌డం ఎలా?

ఇబ్బంది పెట్టే యాప్‌ల‌ను నిరోధించ‌డం
మ‌న‌కు చాలా యాప్‌లు త‌ల‌నొప్పి తెప్పిస్తాయి. అన‌వ‌స‌ర యాడ్స్ మ‌న‌కు చూపించ‌డం లేదా అస్త‌మానం హ్యాంగ్ అవ‌డం లాంటి స‌మ‌స్య‌ల్ని సృష్టిస్తాయి. ఇలాంటి యాప్‌ల‌ను నిరోధించాలంటే సెట్టింగ్స్‌లో అవ‌స‌ర‌మైన ఛేంజ్‌లు చేసుకోవాలి. అందుకోసం యాప్ లిస్టులోకి వెళ్లి మీరు ఛేంజ్ చేయాల‌నుకుంటున్న యాప్‌ను ఓపెన్ చేయాలి. అందులో నోటిఫికేష‌న్ ఆప్ష‌న్‌కు వెళ్లాలి. నోటిఫికేష‌న్స్ ఆన్ అని ఉంటే అల‌వ్డ్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. ఇంకో ఆప్ష‌న్ బ్లాక్డ్ అని ఉంటుంది. మీరు బ్లాక్డ్ మీద క్లిక్ చేస్తే ఆ యాప్ నుంచి మీకు ఇంకా నోటిఫికేష‌న్లు రావు. ఇలా ఏ యాప్ కైనా మీరు డునాట్ డిస్ట‌ర్బ్ ఆప్ష‌న్‌ను యూజ్ చేసుకోవ‌చ్చు. 

ప్ర‌యారిటీ మోడ్‌తో..
డునాట్ డిస్ట‌ర్బ్ ఆప్ష‌న్‌ను దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ల‌లో ఉప‌యోగించుకోవచ్చు. అయితే ఇది అన్ని ఫోన్ల‌లో ఒకేలా ఒకే పేరుతో ఉండ‌క‌పోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు గెలాక్సీ ఫోన్లు తీసుకుంటే డునాట్ డిస్ట‌ర్బ్ ఆప్ష‌న్ డైరెక్ట్ ఆప్ష‌న్‌గా ఉంటుంది. ట‌ర్న్ ఇట్ నౌ అనే ఆప్ష‌న్ ప్రెస్ చేస్తే చాలు. మీకు అన‌వ‌స‌ర‌మైన నోటిఫికేష‌న్లు, ఫోక్‌లు ఆగిపోతాయి.  ఇందుకు ప్ర‌యారిటీ మోడ్‌ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ నోటిఫికేన్స్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత నోటిఫికేష‌న్‌ను క్లిక్ చేయాలి. నోటిఫికేష‌న్ ప్యాన‌ల్‌లో డునాట్ డిస్ట‌ర్బ్ ఆప్ష‌న్ సెల‌క్ట్ చేసుకోవాలి. 

Configure Do Not Disturb Settings Android