ఆండ్రాయిడ్ మొబైల్ వాడేవాళ్లలో అత్యధిక మందికి స్క్రీన్ షాట్ తీయడం ఎలాగో తెలుసు. వాల్యూమ్ డౌన్, పవర్ బటన్‌ను ఒకేసారి ప్రెస్ చేస్తే మీ స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది. అంతేకాదు ఇప్పుడు చాలా ఫోన్లలో ప్రైమరీ సెట్టింగ్స్‌లోనే స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్ కూడా ఉంది. దాన్ని ప్రెస్ చేస్తే స్క్రీన్‌షాట్ వచ్చేస్తుంది. మన స్క్రీన్ మీద ఉన్న దాన్ని అచ్చం అలాగే చూపెట్టేదే స్క్రీన్‌షాట్. కానీ మనం ఏదైనా పొడవైన చాట్‌ను స్క్రీన్‌షాట్ తీయాలంటే ఏం చేయాలి? స్క్రోల్ చేస్తూ రెండు, మూడు స్క్రీన్‌షాట్లు తీస్తాం. అలాకాకుండా ఒకే స్క్రీన్‌షాట్‌లో మనం అనుకున్నది రావాలంటే ఓ ఆప్షన్ ఉంది. దాని పేరే స్క్రోలింగ్ స్క్రీన్ షాట్.
ఏ ఫోన్లలో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్ ఫీచర్ ఉంది?
లేటెస్ట్‌గా వస్తున్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఈ స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. శాంసంగ్, వన్‌ప్లస్, ఎల్‌జీ, హువావే లాంటి పెద్ద కంపెనీలు తమ కొత్త మోడల్ ఫోన్లలో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్‌ను పెడుతున్నాయి. అయితే దీనికి ఒక్కో కంపెనీ ఒక్కో పేరు పెట్టుకుంటున్నాయి. అవేమిటి, ఆ ఫోన్లలో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్ ఎలా తీయాలో చూద్దాం.
శాంసంగ్ స్క్రోల్ క్యాప్చర్
1. శాంసంగ్ నోట్ 5లో ఈ ఫీచర్ ఉంది. దీన్ని స్క్రోల్ క్యాప్చర్ అని పిలుస్తున్నారు.
2. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వాన్స్డ్ ఫీచర్స్‌ను టాప్ చేయాలి.
3. దానిలో నాలుగో ఆప్షన్ కింద స్మార్ట్ క్యాప్చర్ అని కనిపిస్తుంది. దాన్నిటూగుల్ చేసి ఆన్ చేయాలి.
4. ఇప్పుడు మీరు స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్ తీయాలనుకున్న పేజీలోకి లేదా చాట్‌లోకి వెళ్లండి. మీరు స్క్రీన్‌షాట్ కోసం వాల్యూమ్ డౌన్, పవర్ బటన్ నొక్కగానే క్రాప్, ఎడిట్, షేర్ ఆప్షన్ల కంటే ముందు ఒక స్క్వేర్ బాక్స్‌లాంటి దానిలో రెండు డౌన్ యారోస్ ఉన్న సింబల్ కనిపిస్తుంది. అదే స్క్రోల్ క్యాప్చర్ ఐకాన్. దాన్ని టాప్ చేయండి. ఇప్పుడు మీకు ఆ పేజీ లేదా చాట్‌లో ఎక్కడి వరకు స్క్రీన్‌షాట్ కావాలో అక్కడి వరకు స్క్రోల్ చేయండి.
5. ఇప్పుడు మీకు క్యాప్చర్ చేసిన స్క్రీన్‌షాట్ యొక్క చిన్న ప్రివ్యూ స్క్రీన్ ఎడమవైపు కింది భాగంలో కనిపిస్తుంది. మీరు స్క్రీన్‌షాట్‌లో మోడిఫికేషన్స్ చేయాలంటే గ్యాలరీలోకి వెళ్లి స్క్రీన్‌షాట్ ఫోల్డర్‌లోకి వెళ్లి కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు.
హువావేలో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్స్ తీయడం ఎలా?
1. హువావే ఫోన్‌లో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్ తీయాలంటే వాల్యూమ్ డౌన్, పవర్ బటన్‌లను ఒకేసారి ప్రెస్ చేయాలి.
2. మీ స్క్రీన్‌షాట్ తీసినట్లు ఒక ఇమేజ్ వస్తుంది. దాని కింద స్క్రోల్‌షాట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని టాప్ చేయండి.
3. ఇప్పుడు మీ ఫోన్ స్ర్క్రీన్ కిందికి స్క్రోల్ అవుతుంటుంది. మీరు ఎక్కడి వరకు స్క్రీన్‌షాట్ తీయాలనుకుంటున్నారో అక్కడి వరకు స్క్రోల్ డౌన్ చేస్తూ వెళ్లండి. మీరు చాలు అనుకున్నచోట టాప్ చేస్తే స్క్రీన్ స్క్రోలింగ్ ఆగిపోతుంది.
4. అంటే మీ స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్ రెడీ అయిపోయింది. కావాలంటే మీరు దాన్ని ఎడిట్, షేర్ లేదా డిలీట్ చేసుకోవచ్చు.
థర్డ్ పార్టీ యాప్
మీ ఫోన్‌లు కాస్త పాత మోడలా? అయ్యో మా ఆండ్రాయిడ్ ఫోన్లో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్ తీయడానికి లేదే ఎలా అనుకుంటున్నారా? ఈ పని చేసిపెట్టడానికి మీకు ప్లే స్టోర్‌లో చాలా యాప్స్ ఉన్నాయి. వీటిలో లాంగ్ షాట్ యాప్ ఒకటి. దాన్ని ఉపయోగించి మీరు
స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్‌లు కూడా తీసుకోవచ్చు.
1. ప్లే స్టోర్లోకి వెళ్లి లాంగ్ షాట్ (LongShot) యాప్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
2. మీరు స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్ ఆటోమేటిగ్గా తీసుకోవాలంటే ఈ యాప్‌లో ఆటో స్క్రోల్ అనే ఆప్షన్ పక్కనున్న చెక్‌బాక్స్‌ను టిక్ చేయండి.
3. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Accessibility>Installed Services>LongShotను టూగుల్ చేసి ఆన్ చేయండి. పర్మిషన్లు ఇచ్చి ఓకే బటన్ నొక్కండి.
4. క్యాప్చర్ స్క్రీన్‌షాట్ బటన్ పక్కన ఉన్న బ్లూ బటన్ నొక్కండి. ఇప్పడు యాప్ పర్మిషన్లు అడుగుతుంది. Allow Permission అనే ఆప్షన్‌ను స్విచ్ ఆన్ చేయండి.
5. ఇప్పుడు ఒక పాప్ అప్ వస్తుంది. దానిలో కింద ఉన్న స్టార్ట్ నౌ బటన్‌ను క్లిక్ చేయండి.
6. స్క్రీన్ మీ ఒక రెడ్‌లైన్ వస్తుంది. దాన్ని స్క్రోల్ చేసి స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ సెట్ చేసుకోండి. డన్ అని ఒక ఫ్లోటింగ్ బటన్ ఫ్లో అవుతుంటుంది. మీరు ఆపాలనుకుంటున్నప్పుడు దాన్ని క్లిక్ చేస్తే అక్కడి వరకు స్క్రీన్‌షాట్ ఓకే అవుతుంది.
7. తర్వాత స్క్రీన్‌లో మీరు స్క్రీన్‌షాట్ ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే ఒరిజినల్ స్క్రీన్‌షాట్‌ను అలాగే ఉంచేసుకోవచ్చు. తర్వాత దాన్ని సేవ్ చేసుకోవాలి.
Android Scrolling Screen shots Samsung Scroll Capture LongShot App ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à±â€Œà°²à±‹ à°¸à±à°•à±à°°à±‹à°²à°¿à°‚à°—à± à°¸à±à°•à±à°°à±€à°¨à±â€Œà°·à°¾à°Ÿà±â€Œ శాంసంగౠసà±à°•à±à°°à±‹à°²à± à°•à±à°¯à°¾à°ªà±à°šâ€Œà°°à±â€Œ లాంగౠషాటౠయాపà±â€Œ Â