స్మార్ట్‌ఫోన్లు వాడేవాళ్లు ఇప్పడు కచ్చితంగా పాస్‌వర్డ్ పెట్టకుంటారు. ఎందుకంటే ఎంతో విలువైన సమాచారం మన ఫోన్లలో ఉంటుంది. సున్నితమైన సమాచారాన్ని ఫోన్లలో దాచుకుంటాం కాబట్టే పాస్‌వర్డ్ మస్ట్‌గా పెట్టుకుంటాం. అయితే చాలామంది పాస్‌వర్డ్ పెట్టుకోవడంలో అశ్రద్ధగా ఉంటారు. సులభంగా అర్ధమయ్యేలా పాస్‌వర్డ్‌లు పెట్టేస్తారు. అయితే పాస్‌వర్డ్ పెట్టుకోవడం మస్ట్ కాబట్టి మనం పాస్‌వర్డ్ పెడతాం. కానీ ప్రతిసారి ఫోన్ చేయాలనుకున్నప్పుడో లేదా ఆ డివైజ్‌ను యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు పాస్‌వర్డ్ ప్రతిదానికి అడ్డుపడుతూ ఉంటుంది. ఇది ఒక రకంగా మనల్ని ఇబ్బందిపెట్టే అంశమే. ఇందుకోసం ప్రతి యాప్‌కు దేనికి దానికి పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటే సరిపోతుంది. మరి ప్రతి యాప్‌కు పాస్‌వర్డ్‌లు పెట్టడం ఎలా?
యాప్ లాక్‌తో..
ఆండ్రాయిడ్ డివైజ్‌లో యాప్‌లను ప్రొటెక్ట్ చేయడానికి చాలా యాప్‌లు ఉన్నాయి. కానీ వాటిలో యాప్ లాక్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి యాప్ లాక్, ఫింగర్ ప్రింట్ లాక్, ఫోన్ క్లీనర్ బై సూపర్ టూల్స్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుని స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్రియేటింగ్ పాస్‌వర్డ్ ఆప్షన్‌ను యూజ్ చేసుకుని కొత్త పాస్ వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. పాస్‌వర్డ్‌ను రీఎంటర్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మీకో స్మాల్ పాపప్ స్క్రీన్ కనిపిస్తుంది. దీనికి పర్మిషన్లు ఇచ్చిన అనేబుల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
ఏ యాప్ కావాలంటే ఆ యాప్
ఒకసారి మీరు యాప్ లాక్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏ యాప్ కావాలంటే ఆ యాప్‌ను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే వాట్సప్, ఫేస్‌బుక్, మెసెంజర్ ఇలా దేనికి దానికి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మెసెంజర్ యాప్‌ను చూసుకుంటే దీన్ని ఓపెన్ చేసి కొత్త పాస్‌కోడ్‌ను ఎంటర్ చేయాలి. పాస్‌కోడ్‌ను ఛేంజ్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెట్ పాస్‌వర్డ్ మీద క్లిక్ చేసి మార్చుకునే అవకాశం ఉంది. పాస్‌వర్డ్‌తో పాటు ప్యాట్రన్, ఫింగర్ ప్రింట్‌లను కూడా పెట్టుకునే అవకాశం మీకుంది.
Password Protect App Android Devices App lock