ఆండ్రాయిడ్ ఫోన్లో స్క్రీన్ ఆఫ్ చేసి ఉండగా రహస్యంగా వీడియో రికార్డు చేయడం  ఎలా?

ఆండ్రాయిడ్ ఫోన్లో మనం ఏ పని చేయాలన్నా ముందుగా స్క్రీన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే లాక్ వేసి ఉంటే ఏ ప్యాట్రనో కొట్టి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇలా స్క్రీన్ లాక్ పెట్టుకోవడం చాలా కామన్ విషయమే. అయితే స్క్రీన్ ఆఫ్ చేసి ఉన్న ఫోన్ లో  రహస్యంగా వీడియో రికార్డు చేయచ్చు.. అదెలా అంటారా? దానికి ఒక పద్ధతి ఉంది. మరి అదెలాగో చూద్దాం..

క్విక్ వీడియో రికార్డర్

ఒక ఫోన్లో సీక్రెట్ గా వీడియోను రికార్డు చేయడానిికి క్విక్ వీడియో రికార్డర్ అనే యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ కెమెరా వ్యూ ఫైండర్ ని కూడా చూపించదు. సింగిల్ బటన్ ఉన్న టైమర్ మాత్రమే ఉంటుంది. దీని ద్వారా వీడియో రికార్డింగ్ చేసి స్టాప్ చేసుకోవచ్చు. మీరు వీడియో రికార్డు చేసేటప్పుడు ఫ్లాష్, షట్టర్, స్క్రీన్ ఆఫ్ చేసి తీసుకోవచ్చు. 480 పీ, ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ తో వీడియో తీసుకోవచ్చు. రికార్డు ట్రిమ్ చేయడం, షెడ్యుల్డ్ రికార్డింగ్ లాంటి ఆప్షన్లు దీనిలో ఉన్నాయి. 

ఎలా చేయాలంటే..

ప్లే స్టోర్ కి వెళ్లి క్విక్ వీడియో రికార్డర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేయాలి. ఈ యాప్ తొలిసారి ఓపెన్ చేస్తున్నప్పుడు మీ కెమెరా యాక్సెస్ కోసం ఇది పర్మిషన్ అడుగుతుంది. అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఈ యాప్ మెయిన్ స్క్రీన్ ఓపెన్ చేస్తుంది. దీనిలోనే మీకు టైమర్, రికార్డు, స్టాప్ బటన్ కనిపిస్తుంది. మీరు షెడ్యుల్డ్ రికార్డింగ్ పెట్టుకుంటే మీకు అవసరమైన సమయంలో రికార్డింగ్ సార్ట్ అయిపోతుంది. అయితే దీనికన్నా ముందు కెమెరా 2 ఏపీఐ బేటా మోడ్ కి సపోర్టు చేస్తుందా లేదా చూసుకోవాలి. ఫ్లాష్ లైట్, ఆటో ఫోకస్, వీడియో స్టెబిలైజేషన్, ప్రి వ్యూ మోడ్, షో టైమర్ గమనించుకోవాలి. గ్యాలరీలో వీడియోని హైడ్ చేయాలి. సిస్టమ్ లో హైడ్ చేయాలి. పాస్ వర్డ్ ప్రొటెక్షన్ అనేబుల్ చేసుకోవాలి. 

SECRETLY RECORD VIDEO BACKGROUND SCREEN OFF ANDROID