మీరు ఏదైనా జర్నీలో ఉన్నప్పుడో లేదా ఏమీ తోచనప్పుడో వెంటనే మ్యూజిక్ మీదకు మనసు మళ్లుతుంది. కానీ మనకు నచ్చిన అన్ని సాంగ్స్ మన ఫోన్‌లో ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు మీ స్నేహితులను మ్యూజిక్ ఫైల్స్ ట్రాన్సఫర్ చేయాలని అడుగుతారు. మరి ఇలాంటప్పుడు వాళ్ల దగ్గర ల్యాప్‌టాప్ లేకపోతే! ఇలా ట్రాన్సఫర్ చేయడానికి కొన్ని యాప్‌లు ఉన్నాయి. మరి ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ మ్యూజిక్ ట్రాన్సఫర్ చేయడానికి బెస్ట్ యాప్‌లు ఇవే..
షేర్ ఇట్
పైల్ షేరింగ్ యాప్స్‌లో ఇదే పాత యాప్‌గా చెప్పుకోవచ్చు. వైఫైని యూజ్ చేసుకుని ఇది ఫైల్స్ ట్రాన్సఫర్ చేస్తుంది. దీన్ని యూజ్ చేయడం చాలా సులభం. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సెండ్ ఆర్ రిసీవ్ బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు. మ్యూజిక్ ట్యాబ్ కింద ఆడియో ఫైల్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. కేవలం ఫైల్స్ మాత్రమే కాదు ఆల్బమ్స్, ఫోల్డర్స్ కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. నెట్ లేకుండానే ఫైల్స్ సెండ్ చేసుకోవచ్చు. అనవసరమైన ప్రకటనలు రావడం దీనిలో ప్రతికూలత.
ఎక్సెండర్
షేర్ ఇట్ మంచి యాపే అయినా దీనిలో వచ్చే యాడ్స్ చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఇలా యాడ్స్ లేకుండా నేరుగా ఫైల్స్ పంపుకోవడానికి ఎక్సెండర్ అనే యాప్ అందుబాటులో ఉంది. షేర్ ఇట్ మాదిరిగానే ఇది సిమిలర్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. మ్యూజిక్ ట్యాబ్ కింద ట్యాప్ చేసి ఫైల్స్ సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఇది ఫోల్డర్లను చూడటానికి ట్రాన్సఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ యాప్‌ను అన్ని రకాల ఫ్లాట్‌ఫామ్స్‌లో యూజ్ చేసుకోవచ్చు.
ఫైల్స్ బై గూగుల్
షేర్ ఇట్, ఎక్సెండర్ మాదిరిగానే ఫైల్స్ బై గూగుల్ కూడా పని చేస్తుంది. షేర్ ఇట్, ఎక్సెండర్ లా కాకుండా మ్యూజిక్ హెడింగ్‌లా కాకుండా గూగుల్ లో ప్రత్యేకంగా జనరల్ ఆడియో ట్యాబ్ ఉంటుంది. దీని ద్వారా ఆడియో ఫైల్స్‌ని అన్ని ఫార్మట్లలో ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. దీనిలో ప్రి ఇన్‌స్టాల్డ్ రింగ్‌టోన్స్, ఎస్ఎంఎస్ టోన్స్ లాంటి వాటిని కూడా సులభంగా షేర్ చేసుకోవచ్చు. తేదీ వారీగా, ఆర్టిస్ట్ వారిగా ఫైల్స్ ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. దీనిలో ఉండే ఫైల్ మేనేజర్, క్లీనర్ యాప్ వల్ల ఫైల్స్ పంపడం చాలా సులభం.
Apps Transfer Music Android Phones google share it