మీరు తొలిసారి ట్యాక్స్ పే చేయబోతున్నారా? మీకు ఇప్పటివరకూ పాన్ కార్డు లేదా? దీని కోసం ఎక్కడ అప్లై చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారా? మీ సమస్య ఇక తీరిపోయినట్లే! మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు.. పాన్ కార్డ్ మీ చేతిలో ఉన్నట్లే. అదెలా అంటే.. ఆధార్ కార్డు ఉన్నవారికి తక్షణమే పాన్ కార్డు జారీ చేసే సరికొత్త విధానాన్ని ఆదాయపు పన్ను శాఖ ప్రవేశపెట్టింది.
ఇన్‌కంట్యాక్స్ యాక్ట్ 139 AA (2) ప్రకారం.. 2017, జూలై 1 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. బిజినెస్ లావాదేవీలు, ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్ ఇలా అన్నింటికీ పాన్ కార్డు ఉండాల్సిందే! ఇప్పటికీ చాలా మంది ఈ కార్డు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లు! వీరిని దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను శాఖ కొత్త పద్ధతి రూపొందించింది. ఇందుకు కావాల్సిందల్లా ఆధార్ కార్డు మాత్రమే! దీనిని ఉపయోగించి e-PAN ఎలా పొందాలో తెలుసుకుందాం!
1. ముందుగా ఆధార్ కార్డులోని ఆధార్ నెంబరు, పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, మొబైల్ నంబర్ వంటి వివరాలు ఆధార్ డేటాబేస్‌లో అప్‌డేట్ అయి ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఆధార్ కార్డు ఉన్న వివరాలే పాన్ కార్డు మీద కూడా వస్తాయి!
2. ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన వెబ్‌సైట్‌లో ఈ ఇన్‌స్టెంట్ పాన్ కార్డ్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. ఆధార్ కార్డు వివరాలతో పాటు సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
3. అప్లికేషన్‌లో ఉన్నకాలమ్స్ అన్నీ నింపి సబ్మిట్ చేస్తే.. ఆధార్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబరుకు 15 అంకెలు గల రిజిస్ట్రేషన్ నెంబరు వస్తుంది. ఒకవేళ అప్లికేషన్‌లో ఈమెయిల్ కూడా ఇస్తే.. దానికి కూడా ఈ నెంబరు మెయిల్ వస్తుంది.
4. మనం అప్లికేషన్‌లో నింపిన వివరాలు, ఆధార్ డేటాబేస్‌లోని వివరాలతో సరిపోతే.. మొబైల్ నెంబరుకు OTP రూపంలో పాన్ నెంబరు అలాట్ అవుతుంది.
5. పాన్ కార్డు నెంబరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. కొద్ది రోజులకి పాన్ కార్డు పోస్టులో వస్తుంది.
ఇక మరో విషయమేంటంటే.. హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ, సంస్థలు , ట్రస్టీలు, కంపెనీలు మాత్రం ఈ `తక్షణ` పాన్ కార్డు సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం లేదు. ఆధార్‌తో పాన్‌కార్డు లింక్ చేసుకునే గడువును 2019, మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీఐటీ) అధికారులు వెల్లడించారు.
aadhar pan card income tax istant ఆధారౠపానౠకారà±à°¡à± ఇనౠకం టాకà±à°¸à± తకà±à°·à°£à°‚