ఆన్‌లైన్‌లో రైల్వే కంప్ల‌యింట్స్ ఇవ్వ‌డం ఎలా?

ప్ర‌యాణికుల భ‌ద్ర‌తే ల‌క్ష్యంగా రైల్వే శాఖ కొత్త ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇప్ప‌టికే త‌మ వెబ్‌సైట్‌లో ప్ర‌యాణికులు ఫిర్యాదు చేయ‌డానికి ఓ విభాగాన్ని ఏర్పాటు  చేసిన ఇండియ‌న్ రైల్వేస్ ఇప్పుడు వీటికోస‌మే ప్ర‌త్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను,  ఆండ్రాయిడ్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీనిలో ప్ర‌యాణికులు ఫిర్యాదులు చేయ‌డంతోపాటు రైల్వే భ‌ద్ర‌తాద‌ళాలు వాటిని స్వీకరించి త‌గిన చ‌ర్య‌లు తీసుకునేలా ఏర్పాటు చేసింది. 

ఇవీ వివ‌రాలు
http://www.railways.delhipolice.gov.in/  పేరుతో రైల్వేశాఖ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసింది. అలాగే ఆండ్రాయిడ్ మొబైల్స్ కోసం  Sahyatri యాప్‌ను కూడా రిలీజ్ చేసింది.  వీటిలో ప్ర‌ధానంగా క్రిమిన‌ల్ కేసుల‌కు సంబంధించిన ఫిర్యాదులే చేయాల్సి ఉంటుంది.  దీనిలో మీరు చేసిన ఫిర్యాదును దేశ‌వ్యాప్తంగా ఉన్న రైల్వే పోలీసులంద‌రూ చూడ‌గ‌లిగే సౌకర్యం ఉంటుంది. త‌ద్వారా నిందితుడు ఎవ‌రి స్టేష‌న్ ప‌రిధిలో దొరికినా ప‌ట్టుకోవ‌చ్చు.  అలాగే దేశ‌వ్యాప్తంగా ఉన్న నేర‌గాళ్ల రికార్డులు, వాళ్ల ఫోటోలు, వాళ్లు నేరాలు ఎలా చేస్తార‌నే వివ‌రాల‌న్నీ కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. వీటితోపాటు  ప్ర‌య‌ణికులు పోగొట్టుకున్న సామ‌గ్రి వివరాలు,  త‌ప్పిపోయిన వ్య‌క్తుల వివ‌రాలు, ఫోటోలు,  రైళ్ల‌లో,  రైల్వేస్టేష‌న్ ప‌రిస‌రాల్లో, రైలు ప‌ట్టాల ప‌క్క‌న దొరికిన గుర్తుతెలియ‌ని మృత‌దేహాల వివ‌రాలు కూడా ఈ  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 

కంప్ల‌యింట్  ఎలా  రిజిస్ట‌ర్ చేయాలి?
1. http://www.railways.delhipolice.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.  లేదా గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి Sahyatri ఆండ్రాయిడ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని ఓపెన్ చేయండి.

2.  యాప్ లేదా సైట్‌లో పై భాగంలో ఉన్న సిటిజ‌న్ స‌ర్వీసెస్‌ను క్లిక్ చేయండి.

3. అందులో మిస్సింగ్ ప‌ర్స‌న్స్‌, థెఫ్ట్‌, అన్ ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఇలాంటి చాలా ఆప్ష‌న్లు ఉంటాయి. వీటిలో మీకు ఏది అవ‌స‌ర‌మైతే దాన్ని క్లిక్ చేయండి. 

4. ఇప్పుడు ఒక ఫాం వ‌స్తుంది. మీ వివ‌రాల‌తో దాన్ని నింపి సబ్మిట్ చేయండి.

ఈ సౌక‌ర్యాలూ ఉన్నాయ్‌
కంప్ల‌యింట్ రిజిస్ట‌ర్ చేయ‌డంతోపాటు స‌హ‌యాత్రీ యాప్‌లో ఇంకా చాలా  సౌక‌ర్యాలున్నాయి.  గూగుల్ మ్యాప్స్ జియో ట్యాగింగ్ ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్‌కు స‌మీపంలో ఉన్న పోలీస్ స్టేష‌న్‌,   జ‌న‌ర‌ల్  రైల్వే పోలీస్ (జీఆర్పీ) వివ‌రాలను అంద‌జేస్తుంది. క్యూఆర్ కోడ్ స్కాన‌ర్ కూడా ఉంది. ఎమ‌ర్జ‌న్సీ కాల్ లింక్ కూడా అందుబాటులో ఉంచారు. 

Complaint the railways online http://www.railways.delhipolice.gov.in/  Sahyatri App రైలు ప్ర‌యాణికుల ఫిర్యాదుల వెబ్‌సైట్‌ స‌హ‌యాత్రీ యాప్‌  రైల్లో దొంగ‌త‌నాలు నేరాల‌పై ఫిర్యాదులు