కంప్యూటర్లో మీ ఫైల్‌ను అప్‌లోఢ్ చేసిన తర్వాత దాన్ని సురక్షితంగా ఉంచగలం.. మరి ఎలాంటి అప్‌లోడ్ లేకుండా కూడా మీ ఫైల్స్‌ను భద్రం చేసుకోవడం ఎలా? అసలు మీ ఫైళ్లను ఆఫ్‌లైన్‌లో ఎన్‌క్రిప్షన్ ఎలా చేస్తారు. దీనికి కొన్ని మార్గాలు ఉన్నాయి, మీరు ఫైల్‌ను ఎలాంటి అప్‌లోడింగ్ లేకుండా బ్రౌజర్‌ను ఉపయోగించి ఎన్‌క్రిప్షన్ చేసుకోవచ్చు. మరి అదెలాగో చూద్దామా..
హ్యాట్.ఎస్‌హెచ్
ఆన్‌లైన్‌లో మీ ఫైల్‌ను అప్‌లోడ్ చేయకుండానే ఎన్‌క్రిప్షన్ చేయడానికి హ్యాట్.ఎస్‌హెచ్ టూల్ మీకు యూజ్ అవుతుంది. ఈ ఎన్‌క్రిప్షన్ ప్రాసెస్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. సైజుతో సంబంధం లేకుండా, ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఎలాంటి ఫైల్‌నైనా మీరు హ్యాట్.ఎస్‌హెచ్ టూల్‌ను యూజ్ చేసి ఎన్‌క్రిప్ట్ చేసుకోవచ్చు. 6 జీబీ వరకు ఫైల్స్‌ను మనం భద్రం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం క్రోమ్ బ్రౌజర్‌ను యూజ్ చేసుకుని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.
ఎలా ఉంటుంది?
స్టెప్ 1: ఆఫ్‌లైన్‌లో హోమ్ పేజీని ద్వారా ఈ సర్వీసు ఓపెన్ చేయాలి.
స్టెప్ 2: బ్రౌజ్ బటన్‌ను యూజ్ చేసి మీ ఫైల్‌ను ఓపెన్ చేయాలి. మీకు నచ్చిన డిక్రిప్షన్ కీని ఎంటర్ చేయాలి. ప్లెయిన్ టెక్ట్‌లో మాత్రమే ఈ డిక్రిప్షన్ కనిపిస్తుంది. ఈ డిక్రిప్షన్ కీ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
స్టెప్ 3: అప్‌లోడ్, ప్లెయిన్ టెక్ట్ ద్వారా డిక్రిప్షన్ కీ ఎంటర్ చేసిన తర్వాత ఎన్‌క్రిప్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఎన్‌క్రిప్షన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఇది ఎక్కువ సమయం తీసుకోదు. మీరు వెంటనే ఎన్‌క్రిప్టెడ్ ఔట్ పుట్‌ని తీసుకొవచ్చు.
ENCRYPT FILES OFFLINE BROWSER Hat.sh