ఇంట‌ర్నెట్ లేకున్నా మీ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ వాడుకోవ‌డం ఎలా?

గూగుల్ మ్యాప్స్ వ‌చ్చాక ప్ర‌పంచంలో ఏ అడ్ర‌స్‌కి వెళ్ల‌డానికైనా చాలా సులువుగా మారింది. అయితే దీనికి మీ ఫోన్‌లో క‌చ్చితంగా ఇంట‌ర్నెట్ ఉండాలి. అయితే ఒక‌వేళ మీ ఫోన్‌కు ఇంట‌ర్నెట్ అందుబాటులో లేక‌పోయినా కూడా గూగుల్ మ్యాప్స్ వాడుకోవ‌డానికి ఓ ట్రిక్ ఉంది. అదేంటో చూద్దాం.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాప్స్ వాడుకోవ‌డం ఎలా?
* మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ట్యాబ్‌లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి.
* ముందుగా మీ ఫోన్‌కు ఇంట‌ర్నెట్ ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి.
* త‌ర్వాత మీరు వెళ్లాల‌నుకున్న ఊరు పేరును సెర్చ్ చేయండి.
* ఇప్పుడు కింద భాగంలో మీరు వెళ్లాల‌నుకున్న ప్లేస్‌ను టైప్ చేయండి.
* ఇప్పుడు ఆ మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 
* అంతే ఇక మీకు ఇంట‌ర్నెట్ లేక‌పోయినా ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాప్ ఆ ప్లేస్‌కు ఎలా వెళ్లాలో చూపిస్తుంది. 


ఐ ఫోన్‌లో ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాప్స్ వాడుకోవ‌డం ఎలా?
* మీ ఐ ఫోన్ లేదా ఐప్యాడ్‌లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి.
* ముందుగా మీ ఫోన్‌కు ఇంట‌ర్నెట్ ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి.
* త‌ర్వాత మీరు వెళ్లాల‌నుకున్న ఊరు పేరును సెర్చ్ చేయండి.
* ఇప్పుడు కింద భాగంలో మీరు వెళ్లాల‌నుకున్న ప్లేస్‌ను టైప్ చేయండి.
* ఇప్పుడు ఆ మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. 
* అంతే ఇక మీకు ఇంట‌ర్నెట్ లేక‌పోయినా ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాప్ ఆ ప్లేస్‌కు ఎలా వెళ్లాలో చూపిస్తుంది. 

ఆఫ్‌లైన్‌లో గూగుల్ మ్యాప్స్‌ ఇంట‌ర్నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్స్ వాడుకోవడం google maps use google maps in offline Â