ఇన్‌స్టాగ్రామ్.. ప్రపంచంలోనే ఎక్కువ మంది వాడే సోషల్ మీడియా సైట్ ఇది. మన ఫొటోలను పంచుకోవడానికి మంచి ఫ్లాట్‌ఫౄం ఇది. ఫేస్‌బుక్, ట్విటర్ లాంటివి ఉన్నా ఎక్స్‌క్లూజివ్‌గా ఫొటోలు, వీడియోల కోసం మాత్రం ఎక్కువగా యూజ్ చేసే సైట్ మాత్రం ఇన్‌స్టాగ్రామే. అయితే ఈ సోషల్ మీడియా సైట్లో పోస్టు చేసిన ఫొటోలను సేవ్ చేయడం ఎలాగో తెలుసా.. దీనికి ఒక ఆప్షన్ ఉంది అదెంటో చూద్దామా...
ఒక్క క్లిక్‌తో..
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులను నేరుగా సేవ్ చేసే అవకాశం ఉండదు. కానీ యాడ్ ఆన్ ద్వారా మీరు మీకు నచ్చిన పోస్టులను సులభంగా సేవ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను డౌన్‌లోడ్ చేయడానికి వేరే సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ వీటి వల్ల చాలా సమయం వృథా అవుతుంది. అందుకే ఒకే యాడ్ ఆన్ ద్వారా మన ఒక్క క్లిక్‌తో పోస్టులను ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం.
ఫైర్‌పాక్స్‌లో ఇలా..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను సులభంగా సేవ్ చేయడంకోసం రైట్ క్లిక్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అనే యాడ్ ఆన్‌ను మీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే ఈ యాడ్ ఆన్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు ఫైర్ ఫాక్స్ ఎలా ఆప్షన్లు ఇస్తుందో తెలుసుకోవాలి. రైట్ క్లిక్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అనే యాడ్ ఆన్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఫొటోలను మీద రైట్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో డౌన్‌లోడ్ ఇన్‌స్టాగ్రామ్ ఫొటోస్ ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మీరు నేరుగా ఫొటోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SAVE INSTAGRAM PHOTOS RIGHT CLICK FIREFOX