ఏదో ఒక ప్లేస్కి వెళ్లారు. అక్కడ సైన్ బోర్డ్నో, షాప్ మీదున్న బోర్డునో ఫోటో తీసుకున్నారు. లేదంటే ఏదో టూరిస్ట్ ప్లేస్కి వెళ్లినప్పుడు గుడి ముందో, పార్క్ గేటు బయటో నుంచుని ఫోన్ క్లిక్మనిపించారు. పొరపాటున ఆ ఫోటో డిలీట్ అయిపోయింది. దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ డేట్ గుర్తుంటే గూగుల్ ఫోటోల్లోకి వెళ్లి వెతుక్కోవచ్చు. లేకపోతే గూగుల్ ఫోటోస్లో ఉన్న వేల ఫొటోల్లో దాన్ని వెతకడం చాలా కష్టం. ఎందుకంటే మీ ఫోన్లో తీసే ప్రతి ఫోటో దానికి సింక్ అయి ఉన్న గూగుల్ అకౌంట్లో ఫోటోస్లో సేవ్ అవుతుంది. కాబట్టి మీరు తీసిన ఫోటో గ్యాలరీలో నుంచి డిలీట్ అయిపోయినా గూగుల్ ఫొటోస్లో దొరుకుతుంది. కానీ సెర్చ్ చేయాలంటేనే బోల్డంత టైం పడుతుంది.
కొత్త ఫీచర్ తెచ్చిన గూగుల్
యూజర్ల సౌలభ్యం కోసం గూగుల్ ఫోటోస్ సెర్చ్లో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టారు. అదేమిటంటే మీరు తీసిన ఫోటోలో ఉన్న అక్షరాలు గుర్తుంటే చాలు. ఉదాహరణకు డిస్నీల్యాండ్ అని టైప్ చేసి సెర్చ్ చేసి మీరు డిస్నీల్యాండ్ బోర్డు ముందు దిగిన ఫోటోనో, డిస్నీల్యాండ్ బోర్డును మీరు తీసిన ఫోటోనో వచ్చేస్తుంది. వేల కొద్దీ ఫోటోలను గంటల తరబడి వెతకాల్సిన పని లేకుండా ఇది చాలా సులభమైన పద్ధతి.
ఫోటోస్ మీదున్న టెక్స్ట్తో గూగుల్ ఫోటోస్లో సెర్చ్ చేయాలంటే..
1. గూగుల్ ఫోటోస్ను ఓపెన్ చేయండి.
2. సెర్చ్ ఆప్షన్లోకి వెళ్లి మీరు తీసిన ఫోటోలో పేర్లు ఏమైనా ఉంటే వాటిని టైప్ చేయండి. (ఉదాహరణకు డిస్నీల్యాండ్, బావర్చి బిరియానీ హోటల్, శరవణ భవన్, బెంగళూరు ఎయిర్పోర్ట్.. ఇలా ఏదైనా కావచ్చు. )
3. కుడి వైపున ఉన్న సెర్చ్ ఆప్షన్ను ట్యాప్ చేయండి.
4. మీరు టైప్ చేసిన టెక్స్ట్ ఉన్న ఇమేజ్లు మీ గూగుల్ ఫోటోస్లో ఉంటే వెంటనే అవన్నీ డిస్ప్లే అవుతాయి.
5. మీకు శ్రమ లేకుండా, సమయం వృథా కాకుండా ఇమేజ్ దొరికేస్తుంది.
Google Photos backup Google Photos search for images in Google Photos via text గూగà±à°²à± ఫోటోసà±â€Œà°²à±‹ టెకà±à°¸à±à°Ÿà±â€Œà°¤à±‹ సెరà±à°šà±â€Œ గూగà±à°²à± ఫోటోసà±â€Œà°²à±‹ కొతà±à°¤ ఫీచ‌రà±â€Œ Â