ఈమెయిల్ టెంప్లెట్‌గా ఈమెయిల్‌ను కాపీ చేయ‌డం ఎలా?

ఈమెయిల్‌ను ఈమెయిల్ టెంప్లెట్స్ ద్వారా కాపీ చేయ‌డం ఎలాగో మీకు తెలుసా? ఇందుకోసం ఎన్నో ర‌కాల ఆక‌ర్ష‌ణీయ‌మైన టెంప్లెట్లు అందుబాటులో ఉన్నాయి. క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్‌లో అయితే 200 ర‌కాల టెంప్లెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టెంప్ల‌ట్ల‌న్నిటిని మ‌నం ఉచితంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. అంటే మీరు ఎవ‌రికైనా ఆక‌ర్ష‌ణీయంగా ఈమెయిల్స్ పంపాల‌ని భావిస్తే చాలా సింపుల్ అదెలాగో చూద్దాం..

చాలా సుల‌భం
ఈమెయిల్‌ను భిన్న‌మైన‌, ఆక‌ర్ష‌ణీమైన టెంప్లెట్ల‌లో వాడ‌డం చాలా సుల‌భం. ఇందుకోసం మీకు న‌చ్చిన టెంప్లెట్‌ను ఎంచుకుని మెట‌ర్ కాపీ చేసుకుని ఈ టెంప్లెట్‌లో పేస్ట్ చేస్తే చాలు. ఫార్మ‌ల్ ఇన్‌ఫార్మ‌ల్ ఈవెంట్ల‌కు ప్ర‌త్యేకించి ఈ ప్రి డిజైన్డ్ టెంప్ల‌ట్ల‌ను యూజ్ చేయ‌చ్చు. బ‌ర్త్‌డే, ఈవెంట్స్‌, ఫెస్టివ‌ల్స్‌, ఫుడ్ డెల‌వ‌రీ, ఇన్‌ఫార్మ‌ల్ ఈవెంట్స్‌కి మెయిల్ ప‌పండానికి కూడా ఈ టెంప్లెట్ల‌ను యూజ్ చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా బ‌ర్త్‌డే, పెళ్లిలాంటి శుభ కార్యాల‌క ఈ మెయిల్స్ పంపేట‌ప్పుడు ఈ టెంప్ల‌ట్ల వ‌ల్ల ఎంతో అందం వస్తుంది. 

ఈమెయిల్స్‌ని మార్చేయండి..
ఈ జీమెయిల్ ఈమెయిల్ టెంప్ల‌ట్ల కోసం క్రోమ్ ఎక్స్‌టెన్ష‌న్ జీమెయిల్ ఈమెయిల్ టెంప్ల‌ట్ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ ఎక్స్‌టెన్ష‌న్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీ జీమెయిల్ అకౌంట్‌కు ఇది మ‌ళ్లిస్తుంది. టాప్ రైట్‌లో మీకో టెంప్లెట్ ఐకాన్ క‌నిపిస్తుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా ర‌కాల టెంప్లెట్లు క‌నిపిస్తాయి. మీకు కావాల్సిన టెంప్లెట్ల‌ను బ్రౌజ్ చేయ‌డం ద్వారా పొందొచ్చు. మార్క్ దెమ్ యాజ్ స్టార్టెడ్ ద్వారా మీరు ఈ టెంప్లెట్ల‌ను యూజ్ చేసుకోవ‌చ్చు.

COPY EMAIL TEMPLATE Gmail birth day