వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్. మనం ఈ యాప్ ద్వారా పర్సనల్ మెసేజ్‌లతో పాటు గ్రూప్ చాటింగ్ చేస్తాం.. ఫొటోలు, ఫైల్స్ పంపించుకుంటాం. కానీ అవన్నీ మనం వాట్సప్‌లో మాత్రమే చూడగలం. ఒకవేళ ఈ చాట్ పొరపాటున క్లియర్ అయినా.. ఫోన్ మిస్ అయినా మనకు చాటింగ్ మళ్లీ చూడాలనుకుంటే చాలా కష్టం. అయితే ఈమెయిల్ టెక్ట్స్ ద్వారా వాట్సప్ మెసేజ్‌లను చూసే అవకాశం ఉంటే? డబ్ల్యూఏ రీడర్ మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. మరి ఈ టూల్‌ను ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామా..
ముందుగా మన ఆండ్రాయిడ్ ఫోన్లో డబ్ల్యూఏ రీచర్ ఫ్రీ టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది మీ వాట్సప్ చాట్‌ను టెక్ట్ ఫైల్ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాక్ అప్ చేస్తుంది. వాట్సప్‌లో ఎలాంటి కలర్స్‌తో టెక్ట్ మెసేజ్‌లు ఉంటాయో అలాగే ఈ టెక్ట్ ఫైల్‌లోనూ మెసేజ్‌లు ఉండడమే దీని ప్రత్యేకత. ఈ టెక్ట్ ఫైల్ ద్వారా మనం మొత్తం కన్వర్‌సేషన్‌ను చదువుకోవచ్చు. ఈ చాటింగ్‌లో పార్టిసిపెంట్లను కూడా మనం చూడొచ్చు. అయితే గ్రూప్ చాట్‌ల విషయంలో సరిగా పని చేయకపోవడం ఒక్కటే దీనిలో ఉన్న ప్రధాన లోపం. ప్రస్తుతానికి వ్యక్తిగత చాటింగ్‌ల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.
సాధారణంగా వాట్సప్ చాట్‌ను టెక్ట్ ఫైల్ ద్వారా సేవ్ చేస్తే ఆ మెసేజ్‌లను చదవడం చాలా కష్టం. ఎందుకంటే ఇవి ఒక వరుసలో రావు. అన్ని మెసేజ్‌లు కలిసిపోయి గందరగోళంగా ఉంటాయి. అయితే డబ్ల్యూఏ రీడర్ వాడడం వల్ల ఎలాంటి గందరగోళం లేకుండా ఆ మెసేజ్‌లను చదివే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత మెసేజ్‌లను ఉన్నవి ఉన్నట్టుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చదుకునే అవకాశాన్ని ఈ టూల్ మనకు కల్పిస్తుంది. ఈ టూల్ ఒక ఓపెన్ సోర్స్ కావాలంటే మీ పీసీలో కూడా రన్ చేసుకునే అవకాశం ఉంది.
టూలౠరీడà±. వాటà±à°¸à°¾à°ªà± టెకà±à°¸à±à°Ÿà± WHATSAPP