ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌లో అన్ యూజ్డ్ క్యారీ ఓవ‌ర్ డేటా ఎంతుందో చెక్ చేయ‌డం ఎలా?

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్నారా?  మీకు ఇచ్చిన డేటాలో ప్ర‌తి నెలా ఎంతో కొంత మిగిలిపోతుంది అని బాధ‌ప‌డుతున్నారా? ఇలా డేటా మిగిలిపోతే వేస్ట్ కాకుండా ఎయిర్‌టెల్ త‌న బ్రాడ్‌బ్యాండ్ యూజ‌ర్ల‌కు డేటా రోల్ఓవ‌ర్ సౌక‌ర్యాన్ని తీసుకొచ్చింది. అంటే ఈ నెల‌లో మీకు మిగిలిపోయిన డేటాను త‌ర్వాత నెల‌కు తీసుకెళ్లి వాడుకోవ‌చ్చు. అంటే డేటా వేస్ట్ కాద‌న్న‌మాట‌. ఇలా మీకు ఎంత డేటా మిగిలిపోతుందో తెలుసుకోగ‌లిగితే అది వ‌చ్చే నెల‌లో మీ డేటాకు క‌లిసిందో లేదో తెలుసుకోవ‌చ్చు. 
 

1000 జీబీ వ‌ర‌కు
 ఎయిర్‌టెల్ గ‌తేడాది జులై నెల‌లో ఈ డేటా రోల్ఓవ‌ర్ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. మొబైల్ డేటా యూజ‌ర్లు 200 జీబీ వ‌ర‌కు త‌మ డేటాను త‌ర్వాత నెల‌కు క్యారీ ఓవ‌ర్ చేసుకోవ‌చ్చు.  న‌వంబ‌ర్‌లో బ్రాడ్‌బ్యాండ్ యూజ‌ర్ల‌కు కూడా డేటా రోల్ఓవ‌ర్ స్కీమ్ తీసుకొచ్చింది.  బ్రాడ్‌బ్యాండ్ యూజ‌ర్లు 1000 జీబీ వ‌ర‌కు డేటాను తర్వాత నెల‌కు తీసుకెళ్ల‌వ‌చ్చు. 

వెబ్‌సైట్ ద్వారా
1. డెస్క్‌టాప్ లేదా మొబైల్ బ్రౌజ‌ర్‌లో ఎయిర్‌టెల్ సెల్ఫ్‌కేర్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి మీ అన్‌యూజ్డ్ క్యారీ ఓవ‌ర్ డేటా ఎంతో తెలుసుకోవ‌చ్చు.

 2. మీ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ ఉన్న పీసీ లేదా మొబైల్ నుంచి బ్రౌజ‌ర్‌లో www.airtel.in/smartbyte-s/page.html అని టైప్ చేయండి.

3. ఈ వెబ్‌పేజీ మీ అకౌంట్ డిటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. దీనిలో క‌రెంట్ బిల్ సైకిల్‌, క్యారీ ఓవ‌ర్ డేటా ఎంత ఉంది అనే వివ‌రాల‌న్నీ ఇందులో ఉంటాయి.

4. మొబైల్ యూజ‌ర్లు త‌మ  హోం స్క్రీన్‌మీద ఈ స్మార్ట్‌బైట్ సైట్ షార్ట్‌క‌ట్‌ను యాడ్ చేసుకుంటే ఫాస్ట్‌గా యాక్సెస్ చేసుకోవ‌చ్చు. 

ఆండ్రాయిడ్ యాప్‌తో
* ఆండ్రాయిడ్ యూజ‌ర్లు హోమ్ బ్రాడ్‌బ్యాండ్ యూసేజ్ (Home Broadband Usage) అనే యాప్ ద్వారా అన్‌యూజ్డ్ క్యారీ ఓవ‌ర్ డేటా ఎంతో తెలుసుకోవ‌చ్చు. 

* ప్లే స్టోర్ నుంచి హోమ్ బ్రాడ్‌బ్యాండ్ యూసేజ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  మీ ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌తో వైఫై ద్వారా ఈ మొబైల్ క‌నెక్ట్ అయి ఉంటేనే డేటా ఎంతో తెలుసుకోగ‌లరు.

* ఈ యాప్ ఓపెన్ చేస్తే చాలు ఎలాంటి లాగిన్ అవ‌సం లేకుండానే మీ బ్రాడ్‌బ్యాండ్ యూసేజ్ డిటెయిల్స‌న్నీ చూపిస్తుంది.

* టోట‌ల్ మంత్లీ డేటా, ఎన్ని రోజులు ప్లాన్ ఉంది, యావ‌రేజ్‌న రోజూ ఎంత వాడుతున్నారు?  రిక‌మండెడ్ డేటా ఎంత‌?  బిల్ సైకిల్ పిరియ‌డ్‌, ప్లాన్ కోటా, ఉప‌యోగించిన డేటా, క్యారీ ఓవ‌ర్ డేటా వంటి వివ‌రాల‌న్నీ చూపిస్తుంది. 

Airtel Broadband Unused Carry Over Data  Airtel smart bytes site Home Broadband Usage app ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అన్ యూజ్డ్ క్యారీ ఓవ‌ర్ డేటా ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ డేటా రోల్ ఓవ‌ర్‌ ఎయిర్‌టెల్ స్మార్ట్‌బైట్స్ సైట్‌  హోం బ్రాడ్‌బ్యాండ్ యూసేజ్ ఆండ్రాయిడ్ యాప్‌ Â