ఒకేసారి 12 రైలు టికెట్లను బుక్ చేయడం ఎలా ? ఆధార్ లింక్ ప్రాసెస్ మీకోసం 

తరచూ రైల్వే టికెట్లు బుక్ చేసే వారికి ఐఆర్‌సీటీసీ మంచి శుభవార్తను అందించింది. ఇకపై భారతీయ రైల్వే రైలు టికెట్ల బుకింగ్‌ను మరింత సులభతరం చేస్తోంది. సాధారణంగా ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉన్నవాళ్లెవరైనా www.irctc.co.in వెబ్‌సైట్‌తో పాటు ఐఆర్‌సీటీసీ యాప్‌లో 6 రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే 6 కన్నా ఎక్కువ రైలు టికెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ అవకాశం కల్పిస్తోంది. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేస్తే 12 రైలు టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేయడం ఎలాగో తెలుసుకోండి. 

ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్లోకి వెళ్లి అక్కడ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
లాగిన్ అయిన తరువాత అక్కడ కనిపించే ‘My Account’ ట్యాబ్‌లో ‘Link Your Aadhaar’ పైన క్లిక్ చేయాలి.
మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీతో పాటు ఆధార్ కార్డుపైన ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.
తర్వాత ‘Send OTP’ బటన్ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి ‘Verify OTP’ పైన క్లిక్ చేయాలి.
చివరగా ‘Update’ పైన క్లిక్ చేస్తే ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

ఇప్పుడు RailYatri  ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌-IRCTC అఫీషియల్ పార్ట్‌నర్‌గా మారింది. కొద్దిరోజుల క్రితం ఐఆర్‌సీటీసీ నుంచి లైసెన్స్ తీసుకున్న తర్వాత రైలు టికెట్ల బుకింగ్ కోసం సరికొత్త ప్లాట్‌ఫామ్ రూపొందించినట్టు రైల్‌యాత్రి ప్రకటించింది. రైల్‌యాత్రి గత ఆరేళ్లుగా లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఐఆర్‌సీటీసీ, రైల్‌యాత్రి మధ్య కొన్ని నెలలపాటు వివాదం నడిచింది.రైల్‌యాత్రి అందిస్తున్న సేవలు అనధికారమని ఐఆర్‌సీటీసీ వాదించింది. వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. అయితే ఇప్పుడు ఐఆర్‌సీటీసీ నుంచి లైసెన్స్ తీసుకొని సేవలు మొదలుపెట్టింది రైల్‌యాత్రి. 

RailYatri ప్లాట్‌ఫామ్‌లో రైలు టికెట్లు బుక్ చేయడం మాత్రమే కాదు పీఎన్ఆర్ స్టేటస్, లైవ్ ట్రైన్ స్టేటస్, సీట్ల లభ్యత, టికెట్ కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ లాంటి సేవల్ని కూడా పొందొచ్చు. రైల్వే సేవలతో పాటు ఆన్‌లైన్ బస్ టికెట్స్, మీల్ ఆన్ ట్రైన్ లాంటి సేవల్ని కూడా అందిస్తోంది. ఇక భారతదేశంలోని 12 నగరాల్లో ఇంటర్‌సిటీ స్మార్ట్ బస్ సేవల్ని కూడా రైల్ యాత్రి ద్వారా పొందొచ్చు.

ఆధార్ లింక్ ఐఆర్‌సీటీసీ భారతీయ రైల్వే ఆధార్ ఆధార్ వెరిఫికేషన్ పీఎన్ఆర్ స్టేటస్ లైవ్ ట్రైన్ స్టేటస్ రైల్‌యాత్రి