ఆధార్ నంబర్‌తో పాన్ కార్డ్‌ను లింక్ చేయాలని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఎప్పటి నుంచో చెబుతోంది. దీనికి ఇచ్చిన గడువు పూర్తయినా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళుతోంది. పాన్, ఆధార్‌తో లింక్ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సినవారెవరో పక్కాగా తెలుస్తుందన్నది ప్రభుత్వ ఉద్దేశం.
ఆధార్, పాన్ లింకేజ్ చాలా సులువు. ఇన్‌కమ్‌ట్యాక్స్ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి నాలుగైదు సింపుల్ స్టెప్స్‌లో దీన్ని పూర్తి చేసుకోవచ్చు. చాలామందికి అంత టైమ్ ఉండదు. వెబ్‌సైట్ ఓపెన్ చేసి అవన్నీ నింపేంత నాలెడ్జ్ లేని వారూ ఉంటారు. అలాంటి వారికోసం జస్ట్ ఎస్ఎంఎస్ పంపితే ఆధార్‌తో పాన్ లింకేజ్ పూర్తవుతుంది.
ఎస్ఎంఎస్‌తో ఎలా?
1) UIDPAN<12 digit Aadhaar><10 digit PAN?తో మీ ఆధార్, పాన్ లింకేజ్ పూర్తి చేసుకోవచ్చు.
2) మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటే ఆధార్, పాన్ కోసం ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా ఎస్ఎంస్ చేయాలి.
3) ఎస్ఎంఎస్ ఓపెన్ చేసి UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ 12 అంకెల ఆధార్ నెంబర్ టైప్ చేసి, స్పేస్ ఇచ్చి మీ 10 అంకెల పాన్ నెంబర్ నుంచి ఎంటర్ చేయండి.
4)ఈ మెసేజ్‌ను 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయండి.
5) అంతే మీ ఆధార్, పాన్ లింకేజ్ పూర్తవుతుంది.
à°Žà°¸à±à°Žà°‚à°¸à±â€Œà°¤à±‹ ఆధారà±â€Œ పానౠలింకేజà±â€Œ ఆధారౠపానౠలింకేజà±â€Œ Aadhar pan linkage Aadhar pan linkage with SMS