క్రెడిట్ కార్డు క్యాష్ బాలెన్స్‌ని బ్యాంకుకు ఎలాంటి ఛార్జీలు లేకుండా పంప‌డం ఎలా?

అన్ని అవ‌స‌రాల‌కు మ‌నం ఇప్పుడు క్రెడిట్ కార్డునే ఎక్కువ‌గా వాడుతున్నారు.  ఎక్కువ‌శాతం మంది ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ల కోస‌మే క్రెడిట్ కార్డును ఉప‌యోగిస్తున్నారు. కానీ అయితే మ‌న‌కు క్రెడిట్ కార్డును ఆన్‌లైన్‌లోనో లేదా ఆఫ్ లైన్ స్టోర్ల‌లో ఉప‌యోగించుకోవ‌డం మాత్ర‌మే కాక డ‌బ్బులు కూడా తీసుకోవ‌చ్చ‌నేది చాలా త‌క్కువ‌మందికి తెలుసు. అయితే డ‌బ్బులు తీసుకుంటే మాత్రం భారీగా ఛార్జీలు కూడా ప‌డ‌తాయి. అందుకే దీనికి తోడు అద‌న‌పు ఛార్జీలు కూడా వేస్తుంది బ్యాంకు. మ‌రి క్రెడిట్ కార్డులో ఉన్న క్యాష్ బ్యాలెన్స్‌ని బ్యాంకుకు ఎలాంటి ఫీజులు లేకుండా పంప‌డం ఎలా?

క్రెడిట్ కార్డుల నుంచి డ‌బ్బులు బ్యాంకుకు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుంటే పేటీఎం లాంటి సైట్లు గ‌ట్టిగానే ఛార్జీలు వ‌సూలు చేస్తున్నాయి. ఆరంభంలో ఉచితంగా డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే అవ‌కాశం ఇచ్చిన పేటీఎం ఆ త‌ర్వాత ఛార్జీలు భారీగా పెంచేసింది. దీంతో అత్య‌వ‌స‌రం అయిన వాళ్లు త‌ప్ప ఎవ‌రూ దీని జోలికి వెళ్ల‌ట్లేదు. అయితే కొన్ని చిన్న చిట్కాల ద్వారా మ‌నం ఎలాంటి ఛార్జీలు ప‌డ‌కుండా డ‌బ్బుల్ని నేరుగా బ్యాంకుకు పంపే అవ‌కాశం ఉంది.  యూడీఐవో వ్యాలెట్ ద్వారా మ‌నం ఇలా ఎలాంటి ఛార్జీలు లేకుండా డ‌బ్బుల్ని పంపించుకునే అవ‌కాశం ఉంది.  ఇందుకోసం ఏదైనా బ్యాంకు ఇష్యూ చేసి క్రెడిట్ కార్డు కావాలి. యూడీఐవో వ్యాలెట్ కావాలి. దీన్ని ఆధార్ కార్డు ద్వారా కేవైసీ వెరిఫై చేయాలి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకు (కేవైసీ వెరిఫై చేసిన‌ది) అవ‌స‌రం. ఇది కాక‌పోతే పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కావాలి. 

ముందుగా యూడీఐవో వ్యాలెట్‌కు క్రెడిట్ కార్డును ఉప‌యోగించుకుని డ‌బ్బుల‌ను లోడ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత దాన్ని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకుకు పంపాలి. ఆపై పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు పంపాలి. ఆ త‌ర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకు నుంచి మీరు నేరుగా మీ బ్యాంకు అకౌంట్స్‌కి డ‌బ్బులు పంపుకోవ‌చ్చు. ఈ ప్రాసెస్‌లో మీరు ఎలాంటి ఫీజులు చెల్లించ‌క్క‌ర్లేదు. 

Trick Transfer Credit Card Cash Balance Bank Free No Charges