సోషల్ మీడియా అంటే తెలియని రోజుల్లోనే ఒక మెసేంజర్‌ను రూపొందించి.. చాట్‌రూమ్స్ వంటివి క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది యాహూ! కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో వెనుకబడటంతో పాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసేంజర్ వినియోగం పెరుగుతున్న తరుణంలో.. ఇప్పుడు యాహూ మెసేంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు యాహూ ప్రకటించింది. దాదాపు 20 ఏళ్లు సేవలందించిన ఈ మెసేంజర్ జూలై 17 నుంచి పనిచేయదని జూన్‌లో తెలిపింది. ఈ సమయంలో తమ చాట్ హిస్టరీ, ఇతర వివరాలను నవంబర్ నెలాఖరులోగా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఎన్నో ఆప్షన్లు.. ఎంతో క్రేజ్
భవిష్యత్ టెక్నాలజీని ముందే ఊహించి యాహూ మెసేంజర్‌ను 1998 మార్చి 8న ప్రారంభించింది. 2000వ సంవత్సరం నాటికి ఇది మరింత పాపులర్ అయింది. చాట్‌రూమ్స్, గ్రూప్ చాట్ వంటివి బాగా ఫేమస్ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ఈ మెసేంజర్‌ను వినియోగించడం ప్రారంభించారు. ఎవరితోనైనా చాట్ చేసే సౌకర్యం ఉండటంతో దీనికి ఆదరణ నానాటికీ పెరుగుతూ వచ్చింది. వీటితో పాటు రకరకాల ఫీలింగ్స్‌ను తెలియజేయడానికి ఉపయోగించే ఎమోజీలు, స్టిక్కర్లను కూడా ముందుగా యాహూనే ప్రవేశపెట్టింది.
చాట్ హిస్టరీని ఎలా డౌన్ చేసుకోవాలంటే..
* ముందుగా https://messenger.yahoo.com/getmydata లోకి వెళ్లి.. యాహూ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వాలి.
* ఇక్కడ కనిపించే వెరిఫికేషన్ పద్ధతుల్లో ఏదో ఒక దానికి ఎంచుకోవాలి. తర్వాత అకౌంట్ కీని ఎంటర్ స్క్రీన్‌పై కనిపించే బాక్సులో చేయాలి. తర్వాత డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయాలి.
* తర్వాత ఈ-మెయిల్ ఐడీని ఇచ్చి OK మీద క్లిక్ చేయాలి.
* యాహూ మెసేంజర్ హిస్టరీ, ఇతర వివరాలన్నీ మెయిల్‌లో వస్తాయి.
Yahoo Squirrel పైనే దృష్టి
ప్రస్తుతం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసేంజర్ వినియోగం పెరుగుతున్న తరుణంలో..యాహూ మెసేంజర్‌కు క్రమక్రమంగా ఆదరణ తగ్గుతూ వచ్చింది. వీటి నుంచి పోటీని తట్టుకునేందుకు కొత్తగా మారేందుకు ప్రయత్నించినా అందులో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈ యాహూ మెసేంజర్‌ను నిలిపివస్తున్నట్లు యాహూ ప్రకటించింది. Yahoo Squirrel అనే మెసేంజిగ్ యాప్‌ను తీసుకొస్తున్నామని, ఇది టెస్టింగ్ దశలో ఉందని తెలిపింది. యాహూ మెసేంజర్ ఆగిపోయినా.. యాహూ మెయిల్, Fantasy మాత్రం యథావిధిగా పనిచేస్తాయి.
yahoo messenger whatsapp social media download chat conversation yahoo mail యాహూ మెసెంజరౠమెయిలà±