గూగుల్ డ్రైవ్, డాక్స్‌లో క్యాచెని క్లియ‌ర్ చేయడం ఎలా?

మ‌నం ఏదైనా యాప్‌లు వాడుతున్న‌కొద్దీ వాటి ప‌ని తీరు నెమ్మ‌దిగా త‌గ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు డివైజ్ కూడా స్లో అయిపోతూ ఉంటుంది. దీనికి కార‌ణం దీనిలో క్యాచె పెరిగిపోవ‌డం! ఏంటి క్యాచె అంటే.. ఇదొ ర‌కం వ్య‌ర్థం అనుకోవ‌చ్చు. కంప్యూట‌ర్‌లో మ‌న‌కు అవ‌స‌ర‌మైన దాని క‌న్నా ఎక్కువ‌గా ఇది మెమెరీలో చేరుతుంది. యాప్ స్పీడ్‌ని డౌన్ చేస్తుంది. మెమ‌రీని బాగా ఖ‌ర్చు చేస్తుంది. గూగుడ్ డ్రైవ్‌, డాక్స్  లాంటి టూల్స్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. మ‌రి వీటిలో చేరిన క్యాచెని క్లియ‌ర్ చేయ‌డం ఎలాగో తెలుసుకుందాం..

గూగుల్ క్రోమ్‌లో అయితే ఇలా..
గూగుల్ క్రోమ్‌.. ఎక్కువ‌మంది ఉప‌యోగించే బ్రౌజ‌ర్ ఇది. ఇందులో క్యాచె చాలా కామ‌న్ విష‌యం. ఇలాంటిప్పుడు  గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి  డ్రైవ్‌, ఆర్ డాక్స్ వెబ్ యాప్స్ మీద క్లిక్ చేయాలి. ఇందులో యూసేజ్ సెక్ష‌న్‌లోకి వెళ్లి క్లియ‌ర్ డేటా మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క్లియ‌ర్ డేటా మీద క్లిక్ చేసి క‌న్ఫార్మ్ చేయాలి. అలా చేయ‌డం ద్వారా లోక‌ల్ క్యాచె కంటెంట్ మొత్తం క్లియ‌ర్ అవుతుంది. ఈ వెబ్ యాప్స్‌కు సంబంధించిన కూకీస్ కూడా క్లియ‌ర్ అవుతాయి.  ఆండ్రాయిడ్‌లో అయితే క్యాచె క్లియ‌రింగ్  కంట్రోల్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి  డాక్యుమెంట్స్ క్యాచె సెక్ష‌న్‌ని ట్యాప్ చేయాలి. ఆ త‌ర్వాత క్లియ‌ర్ క్యాచె మీద క్లిక్ చేసి ఓకే చేయాలి.

Clear Cache Google Drive Docs