గూగుల్ డ్రైవ్‌లో డిలీట్ అయిన ఫోటోలను రికవ‌ర్ చేయ‌డం ఎలా? 

స్మార్ట్‌ఫోన్ వాడేవారంద‌రికీ గూగుల్ డ్రైవ్ గురించి తెలుసు. మీ ఫోన్‌లోని ఫోటోలు, డాక్యుమెంట్ల‌ను ఆటోమేటిగ్గా దీనిలో సేవ్ చేసుకునే సౌక‌ర్యం ఉంది. అయితే ఒక్కోసారి దీనిలో ఫోటోలు మ‌నం ఏద‌న్నా డిలెట్ చేయ‌బోతే ఇవి కూడా డిలీట్ అయ్యే ప్ర‌మాద‌ముంది. అలాంటి ప‌రిస్థితుల్లో వాటిని రిక‌వ‌ర్ చేసుకోవ‌డానికి కూడా అవ‌కాశం ఉంది. అదెలా అంటే

1. మీ ఫోన్ లేదా పీసీలో గూగుల్ డ్రైవ్‌ను ఓపెన్ చేయండి. 

2. డ్రైవ్‌లో ఎడ‌మ చేతి వైపున్న ఆప్ష‌న్ల‌లో ట్రాష్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.\

3.దానిలో డిలెట్ అయిన ఫైల్స్ ఉంటాయి. వాటిలో నుంచి మీకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఒకేసారి ఒక‌టి ఎక్కువ ఫైల్స్‌ను కూడా సెలెక్ట్ చేసుకోవ‌చ్చు.

4. ఇప్పుడు రీస్టోర్ నొక్కండి. అంతే ఆ ఫైల్స్ అన్నీ మీ గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అవుతాయి.

5. అయితే గూగుల్ డ్రైవ్‌లో నుంచి డిలెట్ అయిన ఫోటోలు ట్రాష్ ఫోల్డ‌ర్‌లో కొంత‌కాలం మాత్ర‌మే ఉంటాయి. ఇవి ఎంత‌కాలంలో ట్రాష్ లో నుంచి పూర్తిగా డిలీట్ అయిపోవాలో ఆప్ష‌న్ మీరే పెట్టుకోవ‌చ్చు. కాబ‌ట్టి ఆ టైంలోగా అయితేనే పొర‌పాటున డిలీట్ అయిన ఫైల్స్‌ను తిరిగి రిక‌వ‌ర్ చేసుకోగ‌లుగుతార‌ని మ‌ర్చిపోకండి.  

గూగుల్ డ్రైవ్ ఫైల్స్ డిలెట్‌ గూగుల్ డ్రైవ్ డిలెటెడ్ ఫైల్స్ రిక‌వ‌రీ recover deleted files from google drive google drive files recovery