గూగుల్ ఫొటో్లు.. గూగుల్‌లో మనకు బాగా ఉపయోగపడే ఆప్షన్ ఇది. మనకు సంబంధించిన అన్ని ఫొటోలను ఎప్పటికప్పుడు దాచి మనకు గుర్తు చేయడం దీని ప్రత్యేకత. ఏ సంవత్సరంలో ఏ ఫొటోలు దిగాం.. ఏ రోజు తీసుకున్నాం లాంటి విషయాలన్ని గూగుల్ ఫొటోస్ మనకు మెమరీస్ రూపంలో అందిస్తుంది. అయితే గూగుల్ ఫొటోస్‌తో కేవలం ఈ ఒక్క ఉపయోగం మాత్రమే కాదు చాలా ఉన్నాయి. వాటిలో కీలకమైంది గూగుల్ ఫొటో మ్యాప్‌లు. మరి గూగుల్ ఫొటోస్‌ను ఉపయోగించి ఫొటో మ్యాప్‌లను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం.
గూగుల్ ఫొటోస్ సాధారణంగా గూగుల్ డ్రైవ్ ద్వారా సేవ్ అవుతాయి. మెమొరీ అయిపోయినా కూడా ఎక్స్‌టెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నిజానికి ఏ యాప్ గూగుల్ ఫొటోస్‌లో లొకేషన్ డేటాతో యాక్సెస్ కలిగి ఉండవు. దీనికి ఏపీఐ ఉండదు. అందుకే యాప్ డెవలపర్స్ గూగుల్‌డ్రైవ్‌లోని మెటా డేటా ఆధారంగా యాక్సెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించేలా చేశారు. దీని వల్ల గూగుల్ ఫొటోస్‌లోని ఫొటోలను, లొకేషన్ డేటాను ఫెచ్ చేసే అవకాశం కలుగుతుంది. ఇందుకోసం ఫొటో మ్యాప్ ఫర్ గూగుల్ ఫొటోస్ అనే యాప్‌ను క్రియేట్ చేశారు,.
ఏం చేయాలంటే..
ప్లే స్టోర్ నుంచి ఫొటో మ్యాప్ ఫర్ గూగుల్ ఫొటోస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీన్ని గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ కావాలి. గూగుల్ డ్రైవ్‌ను యాక్సెస్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి. గూగుల్ డ్రైవ్‌లోని గూగుల్ ఫొటోస్ ఫోల్డర్‌లో ఇది పని చేయడం ప్రారంభిస్తుంది. ఒకవేళ మీరు గూగుల్ డ్రైవ్‌తో గూగుల్ ఫొటోస్‌ని సింక్ చేయకపోతే ఎలా చేయాలో మీకు మార్గం చూపిస్తుంది. ఈ యాప్‌లో మూడు వెర్షన్లు ఉన్నాయి.
గూగుల్ డ్రైవ్ యాప్‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి,. ఇందులో ఆటో యాడ్ అనే ఆప్షన్ ట్యాప్ చేయాలి. దీంతో మీ గూగుల్ ఫొటోస్ గూగుల్ డ్రైవ్‌తో సింక్ అవుతాయి, ఫొటోలు గూగుల్ ఫొటోస్‌లో సేవ్ అవుతాయి. ఆ తర్వాత మ్యాప్ ఫర్ గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఇది మీ గూగుల్ డ్రైవ్ నుంచి ఫొటోలను తీసుకుంటుంది. లొకేషన్ డేటాను బట్టి మ్యాప్‌లో ప్లాట్ చేస్తుంది. మ్యాప్‌లో ఎన్ని ఫొటోలు ఉన్నాయో కూడా చూపిస్తుంది. దీలో స్నాప్ షాట్ తీసుకునే బటన్ కూడా ఉంటుంది. మీరు ఒకే లొకేషన్‌లో ఎక్కువ ఫొటోలు తీసుకుంటే ఇక ఫొటోను మాత్రమే థంబ్ నైల్‌లో చూపిస్తుంది.
CREATE PHOTO MAP GOOGLE PHOTOS google drive