జియో గిగా ఫైబర్ అప్లయి చేసుకోవడం ఎలా, స్టెప్ బై స్టెప్ మీకోసం 

దేశీయ టెలికాం రంగంలో పలు సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో త్వరలో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి ఎంటరవుతున్న విషయం అందరికీ తెలిసిందే. జియో 42వ యాన్యువల్ మీటింగ్ లో జియో అధినేత ముకేష్ అంంబానీ సెప్టెంబర్ 5 నుంచి జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అధికారికంగా ప్రారంభిస్తామని తెలిపారు. జియో ఫైబర్ సర్వీసులో ప్రీమియం కస్టమర్లకు అందించే ప్లాన్లలో ప్రారంభ ధర నెలకు రూ.700ల నుంచి రూ.10వేల వరకు ఉంటాయని జియో ప్రకటించింది. దీంతో పాటుగా జియో ఫైబర్ సర్వీసు ద్వారా మల్టీసర్వీసును యూజర్లకు అందిస్తున్నట్టు కూడా తెలిపారు. ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్, TV సెట్ టాప్ బాక్స్, జియో ఫైబర్ ప్లాన్లతో బండెల్స్ , జియో వెల్ కమ్ ఆఫర్ ను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్ కింద ఎవరైతే యానివల్ ప్లాన్ తీసుకుంటారో వారికి HD లేదా 4K LED TV, 4K సెటప్ టాప్ బాక్స్ ఉచితంగా అందించనుంది. ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా ఫ్రీగా పొందవచ్చు. కొత్త కనెక్షన్ సమయంలో ఎలాంటి ఇన్ స్టాలేషన్ ఛార్జీలు లేకుండానే ఉచితంగా జియో అందించనుంది. మరి జియో ఫైబర్ ఎలా అప్లయి చేయాలో చూద్దాం. 

ముందుగా మీరు https://gigafiber.jio.com/ లోకి వెళ్లాలి. అక్కడ మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఈప్రాసెస్ అయిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి Submit చేస్తే.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి అయినట్టే
రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాక మీకు ఒక Msg వస్తుంది. జియో సేల్స్ ప్రతినిధి నుంచి రిజిస్ట్రేషన్ ధ్రువీకరిస్తూ ఫోన్ కాల్ వస్తుంది. జియో ఫైబర్ కనెక్షన్ కోసం ఏదైనా రెండు ఒరిజినల్ వ్యాలిడ్ ఐడీ డాక్యుమెంట్లు అవసరమవుతాయి. ఆధార్ కార్డు లేదా అడ్రస్ ప్రూఫ్, ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వీటిల్లో ఏదో ఒకటి సమర్పించాలి. 

జియో ఫైబర్ కనెక్షన్.. Installation ప్రాసెస్ 
జియో ఫైబర్ Registration ప్రాసెస్ పూర్తి అయ్యాక జియో తరపు ఇన్ స్టాలేషన్ ఇంజినీర్లు జియో ఫైబర్ సర్వీసు మీరు ఉండే ప్రాంతాల్లో ఉందో లేదో చెక్ చేస్తారు. ఆ తర్వాత మీ ఇంటికి వచ్చి బ్రాడ్ బ్యాండ్ సిస్టమ్ ఇన్ స్టాలేషన్ ప్రాసెస్ ప్రారంభిస్తారు. 

జియో ఫైబర్ సర్వీసు 2 గంటల్లో యాక్టివేషన్ అవుతుంది. కొత్త కనెక్షన్ ఇన్ స్టాలేషన్ పూర్తిగా ఉచితం. దీనికి ఎలాంటి చార్జీలు ఉండవు. జియో ఫైబర్ ఇన్ స్టాలేషన్, కనెక్షన్ పై కస్టమర్లకు కాంప్లిమెంటరీ ఆఫర్ ఉంటుంది. రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే అదనంగా ఇన్ స్టాలేషన్ చార్జీలు ఏమీ ఉండవు.  ఫ్రీ ల్యాండ్ లైన్ కాల్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ సర్వీసులన్నింటినీ  ఒకే ఫైబర్ సర్వీసు ద్వారా యూజర్లు యాక్సస్ చేసుకోవచ్చు.
 

రిలయన్స్ జియో జియో గిగాఫైబర్ సెప్టెంబర్ 5 రిలయన్స్ జియో ఫైబర్ ముకేష్ అంబానీ జియో బ్రాడ్ బ్యాండ్