టెలికం కంపెనీలు కొత్త కొత్త రీఛార్జి ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. రీసెంట్గా జియో 598 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఐపీఎల్ ప్రేమికులను ఉద్దేశించి ఈ ప్యాక్ తీసుకొచ్చామని జియో ప్రకటించింది.
రిలయన్స్ జియో 598 రీఛార్జి ప్లాన్
* ఈ ప్లాన్‌ను 598 రూపాయలతో రీఛార్జి చేసుకోవాలి.
* వ్యాలిడిటీ 56 రోజులు
* రోజుకు 2జీబీ డేటా ఇస్తుంది. అంటే మొత్తం 112 జీబీ డేటా
* రోజుకు 100 ఎస్ఎంస్లు ఫ్రీ
* అన్లిమిటెడ్ ఆన్‌నెట్ కాలింగ్ ఫ్రీ
* జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేయడానికి 2వేల నిముషాల టాక్‌టైం ఫ్రీ.
డిస్నీప్లస్ హాట్‌స్టార్ వీఐపీ ఫ్రీ
ఈ ప్లాన్‌లో హైలెట్ ఏమిటంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ ప్యాక్ ఏడాదిపాటు ఫ్రీగా అందిస్తుంది. ఐపీఎల్ రేపే మొదలవబోతోంది. అది హాట్‌స్టార్‌లోనే లైవ్ వస్తుంది. అందుకే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఈ ప్యాక్తోఅందిస్తుంది.
ఫ్రీ సబ్స్క్రిప్షన్ పొందాలంటే..
* జియో 598 ప్లాన్ రీఛార్జి చేసుకున్న తర్వాత ఓటీపీ వస్తుంది.
* హాట్‌స్టార్ అప్లికేషన్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి.
* యాప్ ఓపెన్ చేసి మీకొచ్చిన ఓటీపీతో దానిలోకి లాగిన్ అవ్వాలి.
* ఏడాదిపాటు డిస్నీ, హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఆనందించొచ్చు.
జియో 598 à°ªà±à°²à°¾à°¨à±â€Œ జియో 598 à°ªà±à°²à°¾à°¨à±â€Œà°¤à±‹ à°¡à°¿à°¸à±à°¨à±€ హాటà±â€Œà°¸à±à°Ÿà°¾à°°à± వీà°à°ªà±€ à°ªà±à°¯à°¾à°•à± à°à°¡à°¾à°¦à°¿ à°«à±à°°à±€ Jio 598 Plan Disney Hotstar VIP Subsription free