ఇప్పుడు నడుస్తోంది మెసేజింగ్ యుగం. వాట్సప్ వచ్చిన తర్వాత మొత్తం సమాచార ప్రసరణ అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో వాట్సప్ తర్వాత టెలిగ్రామ్ మన అవసరాలను బాగానే తీరుస్తుంది. భారత్ లో తయారైన ీ యాప్ ను ఇప్పుడు బాగానే యూజ్ చేస్తున్నారు. అయితే దీనిలో ఉండే చాలా ఆప్షన్లు మనకు తెలియవు. అందులో టెలిగ్రామ్ నుంచి ఎస్ఎంఎస్ ని ఫార్వర్డ్ చేయడం ఎలాగో తెలుసా?
ఆండ్రాయిడ్ రోబో యాప్
టెలిగ్రామ్ ఎస్ఎంఎస్ కోసం వాడే యాప్ ఒకటుంది దాని పేరే ఆండ్రాయిడ్ రోబో యాప్ దీన్నే టెలిగ్రామ్ ఎస్ఎంఎస్ యాప్ అంటారు. ఇది బాట్ సాయంతో ిఇది ఎస్ఎంఎస్ లను పంపడం, ఫార్వర్డ్ చేయడం లాంటి పనులు చేస్తుంది. మీకు టెలిగ్రామ్ యాప్ లో చాట్ హెడ్లో మీకు ఎవరైనా బాట్ ద్వారా పంపిన మెసేజ్ లు కనిపిస్తాయి. ఇది బ్యాక్ గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటుంది. మీ టెలిగ్రామ్ కార్యకలాపాలకు ఎలాంటి ిిఇబ్బందులు కలిగించదు.
ఎలా వాడాలంటే...
టెలిగ్రామ్ ఎస్ఎంఎస్ యాప్ కు సంబంధిచిన ఏపీకే ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉండదు. అందుకే ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి బాట్ ను క్రియేట్ చేసుకోవాలి. యూనిక్ నేమ్ పెట్టాలి,. బాట్ క్రియేట్ చేసిన తర్వాత మీకో కీ కూడా లభిస్తుంది. ఆ బాట్ కీని కాపీ చేసుకోవాలి. బాట్ టోకెన్ ఫీల్డ్ లో దాన్ని పేస్ట్ చేయాలి. మీ ఫ్రెండ్ చాట్ ఐడీని కూడా ఎంటర్ చేయాలి. మీ ఫ్రెండ్ కూడా ఈ బాట్లో ఎంటర్ అయ్యేలా చూసుకోవాలి. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. టెస్ట్ అండ్ సేవ్ ప్రెస్ చేయాలి.
AUTO FORWARD SMS TELEGRAM