ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు...యూజర్లు అన్ని సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇంటర్నెట్లో నుంచి ఎన్నో ఫైల్స్ డౌన్ లోడ్ చేస్తుంటాం. కానీ అవి ఎంతవరకు సురక్షితం అనేది పట్టించుకోం. ఇలా హానికరమైన ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసినట్లయితే మీ కంప్యూటర్ చెడిపోవడం ఖాయం. యాంటీవైరస్ ఉన్నప్పటికీ...ఫైల్‌ను డౌన్ లోడ్ చేయడానికి ముందు సమస్యను గుర్తించలేకపోతే ఏం చేయాలి.ఫైల్స్ డౌన్ లోడ్ చేసేముందు అవి సురక్షితమా? లేదా తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఓసారి చెక్ చేయండి.
మీరు డౌన్ ల్డ్ చేసే ఫైల్ సురక్షితమా...కాదా అని చూడటానికి వైరస్ టోటల్ ఆన్ లైన్ సేవలను అందిస్తుంది. మీరు ముందుగా ఫైల్ డౌన్ లోడ్ లింకును కాపీ చేయాలి.
మీరు డౌన్ లోడ్ చేయాలనుకున్న ఫైల్ ప్రత్యక్ష లింక్ ను కాపీ చేయాలి. మీరు డౌన్ లోడ్ లింక్ పై రైట్ క్లిక్ చేసి, కాపీ లింక్ అడ్రస్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే...ప్రత్యక్ష లింక్‌ను పొందుతారు.
మీ వెబ్ బ్రౌజర్లో కొత్త ట్యాబ్‌ను ఓపెన్ చేసి..." వైరస్ టోటల్. కామ్ " టైప్ చేసిన తర్వాత సెర్చ్ పై ట్యాప్ చేయండి. ఇది హానికరమైన ఫైళ్ల కోసం సెర్చ్ చేయడానికి గూగుల్ యొక్క ఆన్ లైన్ టూల్.
హోంపేజీపై మీ వైరస్ మొత్తం కనిపిస్తుంది. URL ట్యాబ్ పై క్లిక్ చేసి బాక్స్ లోని పైల్ యొక్క కాపీని పేస్ట్ చేయండి. ఫైల్‌ను స్కాన్ చేయడానికి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి. లేదా ఎంటర్ నొక్కండి. ఇప్పుడు సర్వర్ నుంచి ఫైల్‌ను వైరస్ టోటల్ డౌన్ లోడ్ చేస్తుంది. అంతేకాదు పలు యాంటీవైరస్ ఇంజిన్లను ఉపయోగించి స్కాన్ చేస్తుంది.
స్కాన్ పూర్తయిన తర్వాత సేఫ్ అనే మెసేజ్ తో డిస్ల్పే అయినట్లయితే...మీరు ఫైల్‌ను డౌన్ లోడ్ చేయడానికి ముందుకు వెళ్లవచ్చు. ఫైల్ హానికరం అయితే...మీరు ఫైల్లోని సమస్యను గుర్తించిన యాంటీవైరస్ ఇంజిన్ల సంఖ్యను సూచించే మెసేజ్ డిస్ల్పే అవుతుంది.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ ఫైలà±à°¸à± à°¬à±à°°à±Œà°œà°¿à°‚గౠడౌనà±à°²à±‹à°¡à± మొబైలà±à°¸à± ఫీచరà±à°¸à± à°¹à±à°¯à°¾à°•à°¿à°‚à°—à± à°¹à±à°¯à°¾à°•à°°à±à°¸à±