గ్లోబల్ ఎంటర్టైన్మెంట్స్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా? అదీ ఒకటీ రెండూ కాదు ఏకంగా 83 ఏళ్లు ఫ్రీగా ఇస్తామంటే ఎగిరి గంతేస్తారుగా? అయితే అలాంటి ఆఫర్ను నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. అదేంటో చూద్దాం పదండి.
ఇదీ కథ
ద ఓల్డ్గార్డ్ పేరుతో నెట్ఫ్లిక్స్ ఇటీవల ఓ సినిమాను రిలీజ్ చేసింది. అందులో పాత్రలు వందల సంవత్సరాలుగా బతుకుతున్న ఇమ్మోర్టల్స్. అదే స్ఫూర్తితో ఇమ్మోర్టల్ అకౌంట్ను నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ అకౌంట్ మీరు పొందగలిగితే 83 సంవత్సరాలు లేదా 1000 నెలలపాటు నెట్ఫ్లిక్స్ మీరు ఫ్రీగా చూడొచ్చు. ఇందుకోసం మీరు ద ఓల్డ్గార్డ్ వీడియో గేమ్ ఆడాల్సి ఉంటుంది.
ఎలా ఆడాలంటే?
1. ద ఓల్డ్ గార్డ్ వీడియో గేమ్ బ్రౌజర్ బేస్డ్ వీడియో గేమ్. కాబట్టి మీ పీసీ లేదా ల్యాపీలో ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి http://www.oldguardgame.com/. లోకి వెళ్లండి.
2. ఇప్పుడు మీరే ఓల్డ్ గార్డ్లో ప్రధాన పాత్రధారి అయిన హీరోయిన్ అన్నమాట. ఎదురువచ్చే శత్రువులను మీ దగ్గరున్న గొడ్డలితో చంపుతూ వెళ్లాలి.
3. ఇలా అత్యధిక మందిని చంపుతూ వెళ్లినవారికి ఇమ్మోర్టల్ అకౌంట్ దొరుకుతుంది.
4. మీరు పొరపాటున అవతలి వారికి దొరికిపోతే గేమ్ లాసయినట్లే.
ఈ రోజే లాస్ట్ డేట్
జులై 17 నుంచి జులై 19 వరకే ఈ ఆఫర్ అని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. కాబట్టి గేమర్స్ రెడీ టూ ఫైట్. లక్కు బాగుంటే మీరు 83 ఏళ్లు ఫ్రీగా నెట్ప్లిక్స్ చూసేయొచ్చు..!!!
నెటà±â€Œà°«à±à°²à°¿à°•à±à°¸à± 83 సంవ‌తà±à°¸â€Œà°°à°¾à°²à± ఉచితం నెటà±â€Œà°«à±à°²à°¿à°•à±à°¸à± ఉచిత స‌రà±à°µà±€à°¸à± నెటà±â€Œà°«à±à°²à°¿à°•à±à°¸à± ఇమà±à°®à±‹à°°à±à°Ÿâ€Œà°²à± అకౌంటà±â€Œ NetFlix Immortal Account Netflix 83 Years free