నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేయడం ఎలా?

ఆపద సమయాల్లో 112 నెంబర్ కు డయల్ చేస్తే చాలు..అన్ని రకాల అత్యవసర సేవలు అందుతాయి. ఇప్పటివరకు ఉన్న 100 పోలీస్ డయల్, 101 ఫైర్ డయల్,  అంబులెన్స్ డయల్ 108, ఉమెన్ హెల్ప్ లైన్ డయల్ 1090 నెంబర్లు ఉన్నాయి. వీటితోపాటు 112 నెంబర్ లోనే నాలుగు రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర హోం శాఖ. అయితే ఐఫోన్,  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల నుంచి 112 ఎమర్జెన్సీ నెంబర్ కు ఎలా డయల్ చేయాలో  తెలుసుకుందాం. 


* శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లో అయితే పవర్ బటన్ మూడు సార్లు  ప్రెస్ చేసినట్లయితే...ఆటోమెటిగ్గా ఎమర్జెన్సీ నెంబర్ కు డయల్ అవుతుంది. 
* యాపిల్ ఐఫోన్లో అయితే...మూడు సార్లు పవర్ బటన్ ప్రెస్ చేయాలి. వ్యాల్యూమ్ ను హోల్డింగ్ లో పెట్టి పవర్ బటన్ నొక్కినట్లయితే...అత్యవసర నెంబర్ కు డయల్ అవుతుంది. 

* ఒన్ ప్లస్ ఫోన్లో పవర్ బటన్ మూడు సార్లు లేదా ఐదు సార్లు సెట్టింగ్స్ పై నొక్కినట్లయితే డయల్ అవుతుంది.

*ఎల్ జి ఫోన్ నుంచి మూడు సార్లు పవర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే....ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ వెళ్తుంది. 

*షియోమీ నుంచి అయితే లాక్ స్క్రీన్ పై స్వైప్ చేసినట్లయితే....అత్యవసర నెంబర్ కు డయల్ అవుతుంది. 

*ఇక హువాయి, హానర్ యూజర్లు...ఎమర్జెన్సీ నెంబర్ కు డయల్ చేయాలంటే...పవర్ బటన్ పై మూడు సార్లు నొక్కండి. 

* వీవో నుంచి పవర్ బటన్ మూడు సార్లు నొక్కండి.

*ఒప్పో యూజర్లు లాక్ స్క్రీన్ నుంచి స్వైప్ చేసినట్లయితే...అత్యవసర నెంబర్ ఆప్షన్ వస్తుంది. దీని ద్వారా ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేయవచ్చు.

*షియోమీ స్మార్ట్‌ఫోన్ నుంచి పవర్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ లో పెట్టండి. ఇప్పుడు ఎమర్జెన్సీ మోడ్ ఆప్షన్ ద్వారా డయల్ చేయవచ్చు. 

*ఇక గూగుల్ పిక్సెల్ ఫోన్ల నుంచి లాక్ స్క్రీన్ను పైకి స్వైప్ చేయండి. ఎమర్జెన్సీ నెంబర్ ఆప్షన్ వస్తుంది...డయల్ చేయండి. 

నేషనల్ ఎమర్జెన్సీ నెంబర్ 112 శాంసంగ్ యాపిల్ షియోమీ వీవో ఒప్పో NATIONAL EMERGENCY NUMBER 112 sumsung apple xiaomi vivo oppo