ఫేస్‌బుక్‌లో మనం ఎన్నో ఫొటోలను పోస్టు చేస్తాం. కానీ వాటి గురించి ఆ తర్వాత పట్టించుకోం. కానీ మనం ఫేస్‌బుక్ వాడకపోయినా.. లేదా మన అకౌంట్‌ను ఎవరైనా హ్యాక్ చేసినా ఫొటోల సంగతి ఏమిటి? మనకు ఎంతో విలువైన ఆ ఫొటోలను పరిరక్షించేది ఎలా? అయితే ఫేస్‌బుక్‌లో మనం పోస్టు చేసిన ఫొటోలను దాచుకోవచ్చు. అదెలా అంటారా దానికి ఒక మార్గం ఉంది. అదే గూగుల్ ఫొటోస్. సాధారణంగా గూగుల్‌తో సింక్ అయి ఉండే మొబైల్‌లో తీసిన ఫొటోలు అన్ని గూగుల్ ఫొటోస్‌లో సేవ్ అవుతాయి. కానీ ఫేస్‌బుక్‌లో తీసిన ఫొటోలు గూగుల్ ఫొటోల్లో సేవ్ అవ్వాలంటే ఎలా? అసలు ఎఫ్‌బీ ఫొటోలను గూగుల్ ఫొటోలకు పంపడం ఎలా?
ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
ఫేసబుక్‌లో ఉన్న ఫొటోలను మొదట డౌన్‌లోడ్ చేయాలి. ఇందుకోసం మీ పీసీలో ఈ ప్రక్రియ చేయాలి. ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేసి టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న యారో ఐకాన్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్ ఐకాన్‌ను క్లిక్ చేయాలి. లెఫ్ట్ ప్యానల్‌లో ఉండే ఫేస్‌బుక్ ఇన్ఫర్మేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు డౌన్‌లోడ్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాత డౌన్‌లోడ్ ఇన్ఫర్మేషన్ పేజీ మీద క్లిక్ చేయాలి. అక్కడ మీ పాత స్టేటస్‌లు షేర్ చేసిన ఫొటోలు, కామెంట్స్ ఉంటాయి. వీటిలో మీకు అవసరమైన వాటిని కాపీ చేసుకోవాలి. హెట్‌టీఎమ్ఎల్ ద్వారా వీటిని ఫైల్స్‌లా కన్వర్ట్ చేసి డౌన్‌లో చేసుకోవాలి. ఇందుకోసం మీడియా క్వాలిటీ హైలో పెట్టుకోవాలి. ఆ తర్వాత క్రియేట్ ఫైల్ బటన్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ డౌన్‌లోడ్ ప్రాసెస్‌లో తొలి అంచె పూర్తయినట్టు.
ట్రాన్సఫర్ చేయాలిలా..
డౌన్‌లోడ్ చేసుకున్న ఫొటోలను మీ గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి సిస్టమ్ ట్రే ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసి బ్యాక్ అప్ సింక్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ఆ తర్వాత బ్యాక్ అప్ చేసుకోవాలనుకుంటున్న ఫోల్డర్‌ని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన ఫొటోలను ఎంచుకుని అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ పూర్తయిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా బ్యాక్ గ్రౌండ్‌లోనే అయిపోతుంది. సిస్టమ్ ట్రేలో ఈ ప్రొగ్రాస్ అంతా మీరు చూసే అవకాశం ఉంటుంది.
Transfer Facebook Photos Google Photos