మనం స్నేహితులకు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌లు పంపడం చాలా కామన్ విషయం. ఇందులో కొన్ని వ్యక్తిగత మెసేజ్‌లు కూడా ఉంటాయి. ఇందుకోసం చాలామంది మెసెంజర్‌లో మెసేజ్ చేస్తూ ఉంటారు. తమ సన్నిహితులకు తమకు సంబంధించిన విలువైన సమాచారం మాత్రమే కాక ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. మరి ఇలా చేయడం ఎంత వరకు సేఫ్? ఎవరైనా ఈ సమాచారాన్ని తస్కరిస్తే.. ఊహించడానికే ఇబ్బందిగా ఉంది కదా.. ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడటానికి సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజ్‌ల ఆప్షన్ వచ్చింది మరి ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవడం ఎలా?
ఎలా పని చేస్తాయంటే..
ఫేస్‌బుక్ ద్వారా చాటింగ్ చేసుకునే వాళ్ల కోసం సీక్రెట్ కన్వర్షేషన్ అనే ఆప్షన్ ఉంది మెసెంజర్‌లో. దీని ద్వారా ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెసేజ్‌లు పంపొచ్చు. ఈ చాటింగ్ కేవలం వీళ్లిద్దరి మధ్యే ఉంటుంది. ఫేస్‌బుక్ కూడా ఈ చాట్ ట్రాక్ చేయలేదు. అంటే స్పెషల్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది దీనికి. ఈ మెసేజ్‌లకు టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీ సన్నిహితులకు మెసేజ్‌లు పంపిన తర్వాత వాళ్లు ఆ మెసేజ్‌లు చూసిన వెంటనే అవి డిలీట్ అయిపోతాయి. దీని వల్ల మన చాట్ వేరే వాళ్లు చూస్తారనే ఆందోళన అవసరం లేదు. కాంటాక్ట్ ప్రొఫైల్ ఐకాన్ పక్కన ప్యాడ్ లాక్ ఐకాన్ ఉంటుంది. అక్కడే మీకు సీక్రెట్ కన్వర్షేషన్ ఆప్షన్ కనిపిస్తుంది.
ఎలా సెట్ అప్ చేయాలి?
ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మాత్రమే ఈ సీక్రెట్ కన్వర్షేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫేస్‌బుక్ చాట్‌లో మీకు ఈ ఆప్షన్ కనిపించదు. ఫేస్‌బుక్ మెసెంజర్ లైట్ యాప్‌లోనూ ఈ ఆప్షన్ లేదు. ఇక మీరు ఏ డివైజ్‌లో సీక్రెట్ కన్వర్షేషన్ చేస్తున్నారో అదే డివైజ్‌లో మాత్రమే కొనసాగించగలరు. ఒక డివైజ్‌లో ఓపెన్ చేసి ఆ తర్వాత మరో డివైజ్‌కు మారి అక్కడ మీ అకౌంట్‌ని ఓపెన్ చేసి కన్వర్షేషన్ కొనసాగిస్తానంటే కుదరదు. ఇలా చాటింగ్ చేస ముందు మీరు లేటెస్టు ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోవాలి.
Self Destructing Messages Facebook Messenger