ఫోటోలు తీసేటప్పుడు ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్ డిజాబుల్ చేయడం ఎలా

కెమెరా ఫోన్ ఉంటే చాలు...ప్రతిఒక్కరూ ఫొటోగ్రాఫరే. ఫోటోల కోసం ఫోటో స్టూడియోలకు వెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ కాలం నడుస్తోంది. ప్రదేశం ఏదైనా సరే క్లిక్ అనిపించాల్సిందే. అయితే ఫోటో తీసేందుకు కెమెరా ఓపెన్ చేయగానే రకరకాల నోటిఫికేషన్లు వస్తూ చికాకు పెట్టిస్తుంటాయి. ఫోటోపై ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంటాయి. మరలాంటప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో ఫోటోలు తీసేటప్పుడు నోటిఫికేషన్స్ ఎలా డిజాబుల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్ నిలిపివేయడం ఎలా?

MacroDroid పేరుతో  ఆండ్రాయిడ్ యాప్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత...చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. నోటిఫికేషన్లను ఎలా నిలిపివేయాలో ఈ కింది దశల ద్వారా తెలుసుకుందాం. 

స్టెప్ 1.. ఎరుపు రంగు టెంప్లేట్ లో ఉన్న మాక్రోను యాడ్ చేసి నొక్కండి. అక్కడ ట్రిగ్గర్స్, యాక్షన్స్ వంటి క్యాటగిరీలు కనిపిస్తాయి. 

స్టెప్ 2....ఇప్పుడు ట్రిగ్గర్లను యాడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్స్ కు వెళ్లండి. అక్కడ నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన అప్లికేషన్ తో క్లోజ్ చేయవచ్చు. అప్లికేషన్ను ఓపెన్ చేయాలా....లేదా క్లోజ్ చేయాలా...మీకు కావాల్సిన ఆప్షన్ను పాప్ అప్ నుంచి సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు లాంచ్ చేయబడ్డ అప్లికేషన్ను ప్రెస్ చేసి....కొనసాగడానికి ఒకే బటన్ నొక్కండి. 

స్టెప్ 3...యాప్ ను ఓపెన్ చేసినప్పుడు...అప్లికేషన్ డిస్ ప్లేల లిస్టు కనిపిస్తుంది. అక్కడ మీరు కెమెరా యాప్ ను సెలక్ట్ చేసుకోని ఓకే నొక్కండి. తర్వాత అప్లికేషన్ను యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ప్రాంప్ట్ పాప్ అప్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఫోన్ సెట్టింగ్స్ లో అప్లికేషన్ను ప్రారంభించవచ్చు. 

స్టెప్ 4... తర్వాత యాక్షన్స్ ను యాడ్ చేయాలి. ఈ ఆప్షన్ ట్రిగ్గర్స్ పక్కన ఉంటుంది. దానిపై ట్యాప్ చేయవచ్చు. యాప్ యొక్క ఇంటర్ స్పేస్ బ్లూ కలర్ లోకి మారుతుంది. ఇప్పుడు వాల్యూం అనే ఆప్షన్ను సెలక్ట్  గుర్తించి లాస్ట్ వరకు స్క్రోల్ చేయండి. 

స్టెప్ 5...వాల్యూంపై ట్యాప్ చేసిన తర్వాత..యాప్ ఇంకో ఆరు ఆప్షన్లను చూపిస్తుంది.  మొదట మీకు ప్రియార్టి మోడ్/ డోంట్ డిస్టర్బ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కండి. తర్వాత యాప్ అనుసరించే ఇతర ఆప్షన్స్ కనిపిస్తాయి. 

1. అన్నింటిని అనుమతించడం
2. ప్రాధాన్యం ఉన్న నోటిఫికేషన్లను అనుమతించడం
3. అన్నింటిని బ్లాక్ చేయడం
4. అలారం మాత్రమే హైడ్ చేయడం

ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కెమెరాను ఉపయోగించినప్పుడు....యాప్ ను అనుమతించే ట్రిగ్లర్లను, యాక్షన్స్ ను యాడ్ చేయాలి. సెట్ చేసిన యాక్షన్ ఏమైనప్పటికి యాప్ ఇంటర్ స్పేస్ లో కనిపిస్తుంది. 
మీ ఫోన్ dndమోడ్ లో ఉంది కాబట్టి...దాన్ని నిలిపివేయడం చాలా అవసరం. లేదంటే మీ ఫోన్ కు ఎలాంటి యాడ్స్ రాకుండా నిలిపివేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్నలో నోటిఫికేషన్లను తిరిగి పొందడానికి....మీరు కొన్ని ఆప్షన్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 

మ్యాక్రోను యాడ్ చేసి....యాప్స్ నొక్కండి. ఇప్పుడు అప్లికేషన్ లాంచ్, క్లోజ్డ్, ఓకే ఆప్షన్స్ పై నొక్కవచ్చు. తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ యాప్స్ జాబితా కనిపిస్తుంది. ఇప్పుడు కెమెరా యాప్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ టిగ్గర్స్ యాక్షన్ నిలిపివేయబడుతుంది. 

యాక్షన్స్ -> స్క్రోల్ డౌన్-> వాల్యూమ్->ప్రియార్టి మోడ్ / డోంట్ డిస్టర్బ్ నొక్కండి. తరువాత ఇతర ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటన్నింటిని ప్రెస్ చేయండి. 

ఫోటోలు ఆండ్రాయిడ్ నోటిఫికేషన్స్ డిజాబుల్ photos android notifications disable