ఏదైనా డాక్యుమెంట్‌లో కొంత టెక్స్ట్ మీకు కావాలనుకోండి. ఏం చేస్తారు? టెక్స్ట్ ను ఫోన్ కెమెరాతో ఫోటో తీస్తారు. కానీ అందులో మీకు కావాల్సినంత వరకే టెక్స్ట్ తీసుకోవాలంటే ఎలా? ఎక్కడైనా రాసుకోవాలి. అలాంటి ఇబ్బంది అక్కర్లేదు. దీనికోసం ప్లే స్టోర్ లో ఆటోపిక్ అనే మంచి యాప్ ఉంది. ఈ ఆటోపిక్ యాప్ ఆండ్రాయిడ్ కెమెరాతో డాక్యుమెంట్‌ను స్కాన్ చేస్తుంది. అందులో మీరు హైలైట్ చేసిన పార్టును యెల్లో లేదా మరేదైనా లైట్ కలర్ తో ఎక్స్‌ట్రాక్ట్ చేస్తుంది.
హైలెట్ చేసిన టెక్స్ట్‌ను ఆండ్రాయిడ్ కెమెరాతో ఎక్స్‌ట్రాక్ట్ చేయాలంటే
1. ఆటోపిక్ (AutoPick) యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
2. యాప్ ఓపెన్ చేయగానే + గుర్తు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే scan highlights అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
3. వెంటనే యాప్ కెమెరా ఓపెన్ అవుతుంది. అందులో Flash, Capture బటన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు టెక్స్ట్‌ను తీసుకోవాలనుకున్న డాక్యుమెంట్ మీద కెమెరాతో స్కాన్ చేయండి.
4. ఇప్పుడు కెమెరా ఆటోమేటిగ్గా హైలెట్ చేసిన టెక్ట్స్‌ను డిటెక్ట్ చేస్తుంది. లేదంటే మీరే మాన్యువల్‌గా టాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి.
5. ఇలా కావాల్సిన టెక్స్ట్‌ను హైలెట్ చేశాక Capture బటన్ టాప్ చేయండి.
6. వెంటనే ఆ టెక్స్ట్ ఎక్స్‌ట్రాక్ట్ అయి ఒక టెక్స్ట్ కార్డ్ రూపంలో యాప్‌లో క్రియేట్ అవుతుంది.
7. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని టెక్స్ట్ కార్డ్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని ఎడిట్ లేదా టాప్ చేసుకోవచ్చు.
15 భాషల్లో సపోర్ట్
స్టూడెంట్స్‌కు, రీసెర్చర్స్‌కు ఏదైనా ఒక బుక్‌లో కావల్సిన ఇంపార్టెంట్ పాయింట్సన్నీ ఒకచోట స్టోర్ చేసుకోవడానికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్ ఇంగ్లీష్, ఇటాలియన్, జర్మన్, డానిష్, ఫ్రెంచ్, టర్కిష్, లాటిన్.. తదితర 15కి పైగా భాషల్ని ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. టెక్స్ట్‌ను హైలెట్ చేసి తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
Extract Highlighted Text using Android Camera Auto pick app ఫోనౠకెమెరాతో టెకà±à°¸à±à°Ÿà± కాపీ చేయడం ఆటోపికౠయాపà±â€Œ Â