మన ఫోన్ లోని నోట్స్ ను ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ ట్రే కు యాడ్ చేయడం ఎలా?

మీ ఫోన్ లో ఉన్న నోట్స్ ను మీ ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ ట్రే కు యాడ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.  అయితే ఏ ఆండ్రాయిడ్ ఫోన్ లోనూ నోట్స్ ను నోటిఫికేషన్ ట్రే కు యాడ్ చేసే ఆప్షన్ డిఫాల్ట్ గా లేదు. దీనికోసం నోట్స్ ఇన్ నోటిఫికేషన్ అనే ఒక యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలసి ఉంటుంది. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని నోట్స్ నైనా తయారుచేసుకుని మీ ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ ట్రే కు వాటిని ఆటోమాటిక్ గా యాడ్ చేసుకోవచ్చు. క్రిందకు స్లైడ్ చేయడం ద్వారా మీరు వాటిని చూడవచ్చు. ఇలాంటి యాప్ లు ఇంకా చాలా అందుబాటులో ఉన్నాయి కానీ ఈ ఆర్టికల్ లో వివరించబోయే యాప్ అన్నింటికంటే బాగా పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ ట్రే కు నోట్స్ ను యాడ్ చేయడం ఎలా ?

  1. మొదటగా మీరు మీ ఫోన్ లో ఈ నోట్స్ ఇన్ నోటిఫికేషన్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  2. యాప్ ను ఓపెన్ చేస్తే క్రింద + బటన్ కనిపిస్తుంది. ఇది నోట్స్ ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.
  3. బటన్ పై ట్యాప్ చేస్తే ఒక చిన్న పాప్ అప్ డైలాగ్ కనిపిస్తుంది. అక్కడ మీరు నోట్ టైటిల్ మరియు వివరణ ఎంటర్ చేయాలి.
  4. ఆ తర్వాత యాడ్ నోట్ పై ట్యాప్ చేయాలి.
  5. ఇది నోట్ ను క్రియేట్ చేసి మీ ఆండ్రాయిడ్ లో ఉన్న నోటిఫికేషన్ ట్రే కి ఆటోమాటిక్ గా యాడ్ చేస్తుంది .
  6. ఇలా మీరు ఎన్ని నోట్స్ అయినా సరే క్రియేట్ చేయవచ్చు. అవి ఆటోమాటిక్ గా ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ ట్రే కు యాడ్ అవుతాయి,
  7. మీ నోట్స్ ను చూడాలంటే నోటిఫికేషన్ ట్రే ను క్రిందకు స్లైడ్ చేస్తే చాలు.
  8. వాటిని చుసిన తర్వాత కంప్లీట్ అనే బటన్ ను ట్యాప్ చేయడం ద్వారా మార్క్ చేయవచ్చు.
  9. మీరు యాప్ ను ఓపెన్ చేసిన వెంటనే పెండింగ్ నోట్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు వాటిని ప్రెస్ చేయవచ్చు, లేదా మార్క్ చేయవచ్చు మరియు చూసిన నోట్స్ నూ చూడని నోట్స్ నూ సపరేట్ చేయవచ్చు. అలాగే అవసరం లేని వాటిని డిలీట్ కూడా చేయవచ్చు.
  10. యాప్ సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ ట్రే కు ఒక స్విప్ లాక్ కూడా ఉంటుంది. దానిని ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవచ్చు.
  11. ఈ ఆప్షన్ ను ఎనేబుల్ చేస్తే వాటిని హైడ్ చేయవచ్చు లేదా అక్కడే ఉంచవచ్చు.

notes in notification android reminder mark complete disable enable