ఎక్కువమంది ఉపయోగిస్తున్న ఓఎస్‌లలో మాక్ ఓఎస్ ఒకటి. దీనిలో ఉన్న బిల్ట్ ఇన్ ఫీచర్లలో రికార్డ్ ఇంటర్నల్ ఆడియో కూడా ఒకటి. దీనిలో ఉండే క్విక్ టైమ్ ప్లేయర్‌ని ఆధారంగా చేసుకుని మనం ఆప్షన్‌ని ఉపయోగించొచ్చు. అయితే మాక్ ఓఎస్‌లో స్క్రీన్ రికార్డింగ్ టైమ్‌లోనే ఇంటర్నల్ ఆడియో రికార్డింగ్ చేయడం ఎలాగో తెలుసా!
చాలా సులభం..
మనం స్క్రీన్ రికార్డింగ్ టైమ్‌లోనే ఇంటర్నల్ ఆడియో రికార్డు చేయడం చాలా సులభం. ఇందుకోసం మాక్‌లోనే మీకు కొన్ని డిఫాల్ట్ ఆప్షన్లు కనిపిస్తాయి. దీని ద్వారా రికార్డింగ్ లేదా ఆడియో లేదా ఆడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎక్సట్రనల్ మైక్‌ని ఉపయోగించుకోవాలి. అయితే ఇవే కాకుండా మరో ఆప్షన్ ఎలా యాడ్ చేసుకుంటూ మాక్‌ని ఉపయోగించుకోవాలో కూడా చూద్దాం.
ఎలా చేయాలంటే..
1. థర్డ్ పార్టీ యాప్ సౌంఢ్ ఫ్లవర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. ఆడియో ఎంఐడీఐ సెటప్‌ని క్లిక్ చేయాలి. ఇందులో ఉండే స్పాట్‌లైట్ సెర్చ్ మీద ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ప్లస్ సైన్ మీద క్లిక్ చేయాలి. ఆపై ఎగ్రిగేట్ డివైజ్ ఆప్షన్ మీద క్లి్ చేసి ఇంటర్నల్ ఇన్‌పుట్ మీద రినేమ్ చేసుకోవాలి.
3. లెఫ్ట్ కార్నర్‌లో సౌండ్ ఫ్లవర్ 2 సీహెచ్‌లో చెక్ బాక్స్‌ల మీద టిక్ చేయాలి.
4. ఆ తర్వాత ప్లస్ మీద క్లిక్ చేస్తూ మళ్లీ మల్టీ అవుట్ పుట్ డివైజ్‌ని క్రియేట్ చేయాలి. దానికి ఇంటర్నల్ ఆడియో ఆర్ ఈసీ అని రినేమ్ చేయాలి.
5. ఆ తర్వాత సౌండ్‌ఫ్లవర్ 2 సీహెచ్, బిల్ట్ ఇన్ ఔట్ పుట్ చెక్ బాక్సుల మీద టిక్ చేయాలి
6. విండో క్లోజ్ చేసి వేల్యూమ్ మీద క్లిక్ చేయాలి. ఇంటర్నల్ ఆడియో రికార్డింగ్ సెలక్ట్ చేయాలి.
7. మీ స్క్రీన్ రికార్డు చేసే ముందు క్విక్ టైమ్ ప్లేయర్ ఓపెన్ చేసి సౌండ్ సోర్స్ సెలక్ట్ చేసుకుని ఇంటర్నల్ ఔట్ పుట్ సెలక్ట్ చేసుకుని స్టార్ట్ రికార్డింగ్ మీద సెలక్ట్ చేయాలి.
Record Internal Audio Screen Recording MacOS