గూగుల్ మ్యాప్ గురించి ఈ ప్రపంచంలో తెలియని వారు ఉండరు. చాలామందికి గూగుల్ మ్యాప్ అంటే కేవలం నేవిగేషన్ లేక ట్రాఫిక్ అప్ డేట్స్ మాత్రమే అని చెబుతుంటారు. అయితే ఇవే కాకుండా టెక్ దిగ్గజం గూగుల్ కొన్ని రకాల కొత్త ఫీచర్లను కూడా యాడ్ చేసింది. కంపెనీ ఈ యాప్ ఈ మధ్య కొత్తగా నేటివ్ మ్యూజిక్ కంట్రోల్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఇతర మ్యూజిక్ యాప్స్ ని కంట్రోల్ చేయవచ్చు. అలాగే కొత్త మ్యజిక్ యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ ద్వారా మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా..
ఇప్పుడు ఈ యాప్ లో కేవలం గూగుల్ ప్లే మ్యూజిక్ , ఆపిల్ మ్యూజిక్,స్పూటిఫై మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటికే సపోర్ట్ చేస్తుంది. ఇందుకోసం మీరు లేటెస్ట్ వర్షన్ (10.9.2)ని మీ ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్టెప్స ఫాలో కండి.
1. ముందుగా మీ గూగుల్ మ్యాప్ ని టర్న్ ఆన్ చేయాలి. గూగుల్ అకౌంట్ తప్పనిసరిగా లాగిన్ అయి ఉండాలి.
2.ఆండ్రాయిడ్ యూజర్లు సెట్టింగ్స్ లో కెళ్లాలి
ఆపిల్ యూజర్లు కూడా గూగుల్ మ్యాప్ సెట్టింగ్స్ లో కెళాలి.
3. ఆండ్రాయిడ్ యూజర్లు అయితే సెట్టింగ్స్ లో కెళ్లిన తరువాత అక్కడ నేవిగేషన్ సెట్టింగ్స్ లో కెళ్లాలి.
ఐఫోన్ యూజర్లు అయితే కూడా నేవిగేషన్ సెట్టింగ్స్ లో కెళ్లాలి.
4. అది క్లిక్ చేయగానే అక్కడ మీకు how Media Playback Controls అని ఉంటుంది. ఇది డీఫాల్ట్ ఆఫ్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఢీపాల్ట్ సర్వీసును సెలక్ట్ చేసుకోమని చేరుతుంది.
5. అది క్లిక్ చేయగానే ఆండ్రాయిడ్ యూజర్లకు ఆటోమేటిగ్గా మ్యూజిక్ కంట్రోల్ అవుతుంది. ఐఫోన్ యూజర్లయితే యాప్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అకౌంట్ తప్పనిసరిగా లాగిన్ అయి ఉండాలి.
గూగà±à°²à± à°ªà±à°²à±‡ à°®à±à°¯à±‚జికౠఆపిలౠమà±à°¯à±‚జికౠగూగà±à°²à± à°®à±à°¯à°¾à°ªà±à°¸à± ఆండà±à°°à°¾à°¯à°¿à°¡à± à°à°’à°Žà°¸à±