మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఫుల్ స్క్రీన్ యాడ్స్‌ని బ్లాక్ చేయ‌డం ఎలా?

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ ఉప‌యోగిస్తున్న‌ప్పుడు ఏదో ఒక యాడ్ మిమ్మ‌ల్ని డిస్ట‌ర్బ్ చేస్తూనే ఉంటుంది. వీటిలో చాలా యాడ్స్‌కు మీకు ప‌నికొచ్చేవిగా ఉండ‌వు. కొన్ని యాడ్స్ అయితే స్క్రీన్ మొత్తం వ‌చ్చేసి మ‌న ప‌నికి అడ్డు త‌గులుతూ ఉంటాయి. దీనికి కార‌ణం మ‌న‌మే.. నిజంగా మ‌న‌మే: మ‌నం ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల వ‌ల్లే ఈ యాడ్‌లు వ‌స్తుంటాయి.  మ‌న‌కు తెలియ‌కుండానేక కొన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేస్తాం. ఆ త‌ర్వాత వాటిని అన్ ఇన్‌స్టాల్ చేయం.. వీటిలో యాడ్సే మ‌న‌కు అడ్డుప‌డుతుంటాయి. మ‌రి  ఇలాంటి యాడ్స్‌ని బ్లాక్ చేయ‌డం ఎలాగో తెలుసా!

ఈ యాడ్స్‌కి ఏంటి కార‌ణం!
మ‌న ఫోన్లో ఫుల్ స్క్రీన్ యాడ్స్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌నం ఇన్ స్టాల్ చేసిన యాప్‌లే. మీరు కొన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసిన త‌ర్వాత వాటికి అన్ని ర‌కాల ప‌ర్మిష‌న్లు ఇచ్చేస్తాం. ఈ ప‌ర్మిష‌న్ల వ‌ల్లే యాడ్స్ మ‌న ఆండ్రాయిడ్ ఫోన్లోకి చొర‌బ‌డ‌తాయి. అయితే అన్ని యాప్‌లు ఇలాగే ఉండ‌క‌పోయినా కొన్ని యాప్‌ల‌లో స్పామీగా ఉంటాయి. అంటే వైర‌స్ నిండి ఉంటాయి. వీటిని ఇన్‌స్టాల్ చేసి ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌గానే మ‌న ఫోన్లోకి ఆ వైర‌స్‌లు వ‌చ్చేస్తాయి. 

యాడ్స్‌ని రిమూవ్ చేయండిలా..
ఈ యాడ్స్‌ని రిమూవ్ చేయ‌డానికి కొన్ని ప‌ద్ధ‌తులున్నాయి.  ఇందుకోసం మొద‌ట మీరు రీసెంట్‌గా ఇన్‌స్టాల్ చేసిన యాప్స్‌కు సంబంధించిన ప‌ర్మిష‌న్లను ఒక‌సారి చెక్ చేయాలి. ఒక‌వేళ అన‌వ‌స‌రంగా ప‌ర్మిష‌న్లు ఇచ్చామ‌న‌కుంటే ఆ యాప్‌ల ప‌ర్మిష‌న్లు డిజేబుల్ చేయాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి డ్రా ఓవ‌ర్ ద యాప్స్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. అక్క‌డే మీకు  అనేబుల్డ్‌, డిజేబుల్డ్ ఆప్ష‌న్లు ఉంటాయి. వీటిలో అన్ ఇన్‌స్టాల్ అనే ఆప్ష‌న్ కూడా క‌నిపిస్తుంది. మీకు యాప్ అవ‌స‌రం లేక‌పోతే అన్ఇన్‌స్టాల్ చేసేయ‌చ్చు.  ప్లే స్టోర్‌ని యూజ్ చేసి కూడా మోస్ట్ రీసెంట్ యాప్స్ ప‌ని తీరు, ప‌ర్మిష‌న్లు లాంటివి చెక్ చేసుకోవ‌చ్చు.

Block Full-Screen Ads Android Phone ad blocker