మీ కంప్యూట‌ర్‌లో ఆండ్రాయిడ్ డివైజ్ నోటిఫికేష‌న్లు పొంద‌డం ఎలా?

మ‌నం కంప్యూట‌ర్లో ప‌ని చేస్తూ ఉంటాం. ఇలాగా ఫోన్లో ఏవో నోటిపికేష‌న్లు వ‌స్తాయి. వాటిని మ‌నం చూడ‌టం కోసం కంప్యూట‌ర్ వ‌ర్క్‌ని ప‌క్క‌న‌పెట్టేస్తాం. దీని వ‌ల్ల కంప్యూట‌ర్ వ‌ర్క్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, మ‌ధ్య‌లో డిస్ట‌ర్బ్ కావ‌డం జ‌రుగుతూ ఉంటుంది. దీని వ‌ల్ల వ‌ర్క్ కాన్‌స‌న్‌ట్రేష‌న్ పోతుంది. అయితే మ‌న ఆండ్రాయిడ్ డివైజ్ నోటిఫికేష‌న్లు కంప్యూట‌ర్‌కే వచ్చేలా చేస్తే! ఈ ఆలోచ‌న బాగుంది క‌దా.. మ‌రి ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ల‌ను కంప్యూట‌ర్‌కు రావాలంటే ఏం చేయాలి?

యాప్స్ వ‌చ్చాయ్‌
ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో వ‌చ్చే నోటిఫికేష్ల‌ను మ‌న కంప్యూట‌ర్‌లో చూడ‌టానికి కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ల సాయంతో మీరు కంప్యూట‌ర్ వ‌ర్క్ చేసుకునే స‌మ‌యంలో మీ మొబైల్‌కు వ‌చ్చే మెసేజ్‌ల‌ను మీ కంప్యూట‌ర్ స్క్రీన్ మీదే చూడొచ్చు. అంతేకాదు రిప్లే కూడా ఇవ్వొచ్చు. అందుకు అందుబాటులో ఉన్న కొన్ని ప‌ద్ధ‌తులు చూద్దాం. పుష్ బుల్లెట్ అనే యాప్ ఒక‌టి ఉంది. ఇది మీ ఫోన్‌కు వ‌చ్చే మెసేజ్‌ల‌ను కంప్యూట‌ర్‌కు మ‌ళ్లిస్తుంది. ఇందుకోసం ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని మీ డెస్క్‌టాప్ బ్రౌజ‌ర్‌లో ఎక్స్‌టెన్ష‌న్ పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత యాప్‌ను ఓపెన్ చేసి యాప్‌కు అవ‌స‌ర‌మైన ప‌ర్మిష‌న్లు ఇవ్వాలి. ఇందులోనే మీకు మిర్ర‌రింగ్ నోటిఫికేష‌న్ ఆప్ష‌న్ వ‌స్తుంది. మీరు వోన్లీ ఆన్ వైఫై ఆప్ష‌న్‌ను అనేబుల్ చేయాలి. ఆ త‌ర్వాత మీరు ఒక టెస్టు నోటిఫికేష‌న్‌ను ఫోన్‌కు పంపితే అది మీ కంప్యూట‌ర్లో ఉన్న పుష్ బుల్లెట్ ఎక్స్‌టెన్ష‌న్ ద్వారా మ‌న‌కు క‌నిపిస్తుంది. 

ఎయిర్‌డ్రాయిఢ్
పుష్ బుల్లెట్ మాదిరిగానే ఎయిర్‌డ్రాయిడ్ యాప్ ఆండ్రాయిడ్ నోటిఫికేష‌న్ల‌ను కంప్యూట‌ర్లో చూపిస్తుంది. ఇది పుష్ బుల్లెట్ కంటే ఇంకా మెరుగ్గా కూడా ప‌ని చేస్తుంది. ఇందుకోసం మొద‌ట మీ మొబైల్‌లో ఎయిర్‌డ్రాయిడ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత మీ అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. సెక్యూరిటీ, రిమోట్ ఫీచ‌ర్ ఆప్ష‌న్‌ను ట్యాప్ చేసి డెస్క్‌టాప్ నోటిఫికేష‌న్ల మీద క్లిక్ చ‌యాలి. ప‌ర్మిష‌న్లు అనేబుల్డం చేస్తే చాలు. మీ ఫోన్ నుంచి కంప్యూట‌ర్‌కి నోటిఫికేష్లు వ‌స్తాయి.

Android Notifications Computer push bullet