మీ గూగుల్ ఫొటోస్‌ను కంప్యూట‌ర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా?

ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి మ‌న‌కు బాగా యూజ్ అయ్యే యాప్‌ల‌లో గూగుల్ ఫొటోస్ ఒక‌టి. గూగుల్ ఫొటోస్ ప్ర‌త్యేక‌త ఏంటంటే ఇది మ‌న‌కు సంబంధించిన పాత ఫొటోల‌ను బ్యాక్ అప్‌లో స్టోర్ చేసి ఉంచుతుంది. దీని వ‌ల్ల మ‌నం స‌మయం వారీగా, తేదీ వారీగా ఫొటోను  చూసుకునే సౌల‌భ్యం ఉంటుంది. అయితే మ‌నం ఏ ఫొటోను చూసుకోవాల‌న్నా ప్ర‌తిసారీ గూగుల్ ఫొటోస్ యాప్ ఓపెన్ చేయాల్సిందే. అదే కంప్యూట‌ర్‌లో ఉంటే మ‌నం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే అవ‌కాశం ఉంటుంది క‌దా? మ‌రి గూగ‌ల్ ఫొటోస్‌ను మ‌న కంప్యూట‌ర్‌లో సేవ్ చేసుకోవడం ఎలా?

ఏం చేయాలంటే..
మ‌నం గూగుల్ ఫొటొలను కంప్యూట‌ర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే అంత సుల‌భ‌మైన ప‌ని కాదు. ఇలాంట‌ప్పుడు ఏం డౌన్‌లోడ్ చేశామో ఏం చేయ‌లేదో చాలా క‌న్‌ఫ్యూజ‌న్‌గా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్స్‌ట్ర‌న‌ల్ డౌన్‌లోడ‌ర్స్‌కి స‌పోర్ట్ కూడా ఉండ‌దు.  ఈ నేప‌థ్యంలో ఫొటోను డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి ఒక యాప్ సాయం చేస్తుంది. ఆ యాప్ పేరే రై డ్ర‌యివ్‌. మ‌రి రై డ్ర‌యివ్ ఉప‌యోగించి పీసీలోకి ఫొటోస్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం..

1. ముందుగా రై డ్ర‌యివ్ టూల్‌ని మ‌న కంప్యూట‌ర్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇది డెస్క్‌టాప్ మీద ఒక ఐకాన్‌ని క్రియేట్ చేస్తుంది.

2.  ఆ త‌ర్వాత బాక్స్ నుంచి గూగుల్ ఫొటోస్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత డ్ర‌యివ్ నేమ్ కోసం ఆ యాప్ ఒక ఆప్ష‌న్ ఇస్తుంది. డిఫాల్ట్‌గా ఇది జెడ్ అని పేరు ఇస్తుంది. దాన్ని మీరు మార్చుకోవ‌చ్చు.

3.డ్ర‌యివ్‌కు  ఒక పేరు పెట్టాలి. ఒక‌సారి అన్ని సెట్టింగ్స్ స‌రి స‌రి చూసుకున్నాక ఒకే బ‌ట‌న్ మీద క్లిక్ చేయాలి. గూగుల్ అకౌంట్ డిటైల్స్ చెక్ చేసుకుని ప‌ర్మిష‌న్లు ఇవ్వాలి. మీ క్రెడింషియ‌ల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత గూగుల్ ఫొటోస్‌.. రై డ్ర‌యివ్‌తో లింక్ అవుతుంది. ఆ త‌ర్వాత మీ పీసీలోకి గూగుల్ ఫొటోస్‌ను తేలిగ్గా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

Download Google Photos Albums Computer