వాట్సాప్ లేని స్మార్ట్ఫోన్ ఇండియాలో దాదాపు లేదేమో. అంతగా ఫేమస్ అయిపోయింది ఈ మెసేజింగ్ యాప్. అయితే వాట్సాప్లో మన చాట్స్ అన్నీ వాట్సాప్ సర్వర్లో ఉంటాయనుకుంటే తప్పులో కాలేసినట్లే. కొన్ని కోట్ల మంది చాట్స్ను స్టోర్ చేయడానికి ఎన్ని సర్వర్లు పెట్టినా కష్టం. అందుకే వాట్సాప్ మన మెసేజ్లను ఆటోమేటిగ్గా క్లియర్ చేసేస్తుంది. మన ఫోన్లో మాత్రమే అది సేవ్ అయి ఉంటుంది.
ఫోన్ నిండిపోతే
వాట్సాప్ నిండా కాంటాక్ట్లు, ఫ్రెండ్స్ గ్రూప్, క్లాస్మేట్స్ గ్రూప్,ఆఫీస్ గ్రూప్, ఫ్యామిలీ గ్రూప్, కాలనీ గ్రూప్, కమ్యూనిటీ గ్రూప్ ఇలా బోల్డన్ని గ్రూప్లు వాటిలో వచ్చే మెసెజ్లు, ఫోటోలు, వీడియోలు ఇలా బోల్డంత డేటా వచ్చిమన ఫోన్లో చేరిపోతోంది. కాబట్టి మన ఫోన్ 128, 256 జీబీ స్టోరేజ్లున్నవి కూడా చాలడం లేదు. అందుకే గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ తీసుకుంటుంటాం. అయితే ఇలా బ్యాకప్ తీసుకున్న డేటాకు పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేకపోతే మీ ఫోన్లో దాన్ని ఎవరైనా చూసేయొచ్చు.
పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఎలా?
1. వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్లండి.
2. సెట్టింగ్స్లో చాట్స్ సెక్షన్ ఓపెన్ చేసి చాట్ బ్యాకప్ ఆప్షన్ సెలక్ట్ చేయండి.
3. చాట్ బ్యాకప్ సెక్షన్లో గూగుల్ డ్రైవ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
4. దానిలో Password protect backups అనే ఆప్షన్ ఉంటుంది. ఇది డిజేబుల్ అయి ఉంటుంది. ఆ ఆప్షన్ను ఎనేబుల్ చేయండి.
5. ఇప్పుడు పాస్వర్డ్ యాడ్ చేయండి. అంతే మీ గూగుల్ డ్రైవ్లో సేవ్ అయిన వాట్సాప్ మెసేజ్లు పాస్వర్డ్తో ప్రొటెక్ట్ అయిపోయినట్లే.
6. ఇకపై మీరు ఎప్పుడైనా మీ చాట్ బ్యాకప్ను రీస్టోర్ చేయాలంటే కచ్చితంగా పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అంటే మీ బ్యాకప్ను ఎవరూ తీయలేరన్నమాట.
WhatsApp backup on Google Drive వాటà±à°¸à°¾à°ªà± à°¬à±à°¯à°¾à°•‌పà±â€Œà°¨à± గూగà±à°²à± à°¡à±à°°à±ˆà°µà±â€Œà°²à±‹ పాసà±â€Œà°µâ€Œà°°à±à°¡à± à°ªà±à°°à±Šà°Ÿà±†à°•à±à°Ÿà± చేసà±à°•ోవ‌డం వాటà±à°¸à°¾à°ªà± à°¬à±à°¯à°¾à°•‌పౠ గూగà±à°²à± à°¡à±à°°à±ˆà°µà±â€Œà°²à±‹ వాటà±à°¸à°¾à°ªà± à°¬à±à°¯à°¾à°•‌పà±â€Œ