మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లను మెర్జ్ చేసి సింగిల్ వర్డ్ ఫైల్ గా చేయడం ఎలా?

కంప్యూటర్ ను ఉపయోగించే ప్రతి ఒక్కరూ....ఏదో ఒక ఆఫీస్ సూట్ ను ఉపయోగిస్తుంటారు. వర్డ్ ఫైల్స్ దగ్గరి నుంచి డేటా బేస్ తయారీ వరకు అనేక రకాల పనులకు సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉంది. అయితే ఆఫీస్ సూట్ అనగా చాలామందికి ఠక్కున గుర్తుకు వచ్చేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ద్వారా ఒక వ్యాసం రాసి ఫైలును భద్రపరచవచ్చు. ఒకపెద్ద వ్యాసం రాసేటప్పుడు వర్డ్ డాక్యుమెంట్లు ఎన్నో అవసరం అవుతాయి. అన్ని డాక్యుమెంట్లను కూడా వర్డ్ డాక్యుమెంట్లో మెర్జ్ చేయడం చాలా సులభం. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లను మెర్జ్ చేసి సింగిల్ వర్డ్ ఫైల్ గా ఎలా చేయాలో ఓ సారి చూద్దాం. 

సింగిల్ వర్డ్ ఫైల్ గా క్రియేట్ చేయడం ఎలా?
స్టెప్1 : మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసి....ఒరిజినల్ డాక్యుమెంట్ ఫైల్ను ఓపెన్ చేయాలి. 
స్టెప్2: ఇప్పుడు రిబ్బన్ మెనూలో రివ్యూ ట్యాబ్ కు వెళ్లాలి. డ్రాప్ -డౌన్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకుని కంబైన్ ఆప్షన్ పై నొక్కండి. 

మెర్జ్ చేయడం ఎలా?

స్టెప్ 1: ముందుగా, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసి అసలు వర్డ్ డాక్యుమెంట్ ఫైల్ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: ఓపెన్ చేసిన తర్వాత రిబ్బన్ మెనూలో రివ్యూ ట్యాబ్ కు వెళ్లండి. అక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ను ఎంచుకోండి. తర్వాత కంబైన్ ఆప్షన్ పై నొక్కండి. ఇప్పుడు రివ్యూ ట్యాబ్ లో ఆప్షన్ను మెర్జ్ చేయండి. 
స్టెప్ 3: కంబైన్ డాక్యుమెంట్స్ ఫైల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో రెండు సెక్షన్లు ఉంటాయి. 

1. ఒరిజినల్ డాక్యుమెంట్స్:  ఇందులో ప్రైమరీ డాక్యుమెంట్ ను యాడ్ చేయండి. ఒరిజినల్ టేబుల్ లేదా డాక్యుమెంట్ ను మరేదైనా లేబుల్ గుర్తుతో ఉన్న బాక్సులో ఒక పేరు ఎంటర్ చేయండి. ఇలా చేస్తే మీరు అసలు డాక్యుమెంట్ ను గుర్తించడానికి వీలుంటుంది. 

2. రివైజ్డ్ డాక్యుమెంట్స్ : ఇక్కడ ఒరిజినల్ ఫైల్ యొక్క చివరి మార్పు లేదా ఎడిట్ చేసిన వర్డ్ ఫైల్ను యాడ్ చేయాలి. దీంతోపాటు న్యూ డాక్యుమెంట్ రేడియో బటన్ అదే బాక్స్ లోని మెనూలో ఆప్షన్ ఉంటుంది. ఒరిజినల్, ఎడిట్ చేసిన డాక్యుమెంట్లను యాడ్ చేయండి. 

ఇప్పుడు ఓకే బటన్ నొక్కండి. 

స్టెప్ 4 : ఇప్పుడు మీరు వర్డ్ మెయిన్ ఇంటర్ ఫేస్ కు వస్తారు. ఇక్కడ నాలుగు విభాగాలు ఉంటాయి. ఎడిట్ డాక్యుమెంట్లో సెక్షన్ నెంబర్స్ లేదా మార్పుల సంఖ్యను ఎడమ విభాగంలో కనిపిస్తుంది. ఇప్పుడు మిడిల్ సెక్షన్ కంబైన్ డాక్యుమెంట్ తోపాటు టాప్ రైట్ సెక్షన్లో ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిస్తుంది. బాటమ్ రైట్ సెక్షన్లో చివరి డాక్యుమెంట్ ను చూపిస్తుంది. 
 
 

మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లు ఫైలు సింగిల్ వర్డ్ microsoft word documents file single word.