రెండు జీమెయిల్ అకౌంట్ల మ‌ద్య ఈమెయిల్స్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా?

ఒక జీమెయిల్ అకౌంట్‌కు మల్టీపుల్ జీమెయిల్స్‌ను ఒకేసారి మూవ్ చేసే ఆప్ష‌న్ జీమెయిల్లో ఉంది. అయితే జీమెయిల్ మెసేజ్ల‌ను భిన్న‌మైన అకౌంట్ల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం ఎలా... దీనికి కూడా కొన్ని మార్గాలున్నాయి. ఇందుకోసం జీమెయిల్ టు జీమెయిల్ టూల్‌ను యూజ్ చేయాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల ఒక ఈమెయిల్ నుంచి మ‌రో అకౌంట్‌కు సుల‌భంగా ట్రాన్స్‌ఫ‌ర్ జ‌రిగిపోతుంది.

జీమెయిల్ ఈమెయిల్స్ టాన్స్‌ఫ‌ర్‌
జీమెయిల్‌లో ఇంపోర్ట్ మెయిల్స్ అండ్ కాంటాక్ట్స్ అనే టూల్ ఉంది. ఈ టూల్‌ను ఉప‌యోగించి మ‌నం సుల‌భంగా జీమెయిల్ ఈమెయిల్స్‌ని ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఇందుకోసం జీమెయిల్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఫార్వ‌ర్డింగ్ అండ్ పాప్, ఐఎంఏపీ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత బ‌బుల్ నెక్ట్ మీద క్లిక్ చేయాలి. అనేబుల్ పాప్ ఫ‌ర్ ద మెయిల్ ఆప్స‌న్ క్లిక్ చేయాలి.  సెండ్ మెయిల్ యాజ్‌ను ట్యాప్ చేయాలి. అక్క‌డ మీరు పంపాల‌నుకుంటున్న మెయిల్ అడ్రెస్ టైప్ చేయాలి. ఆ త‌ర్వాత కంటిన్యూ కొట్టి అలౌ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ ఇంపోర్ట్‌, ఒకే మీద క్లిక్ చేస్తే చాలు.

డెస్క్‌టాప్ సాయంతో...
డెస్క్‌టాప్ యూజ్ చేసి కూడా మీరు ఈ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఇందుకోస ముందుగా  ఔట్ లుక్ ఓపెన్ చేసి ఫైల్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత అకౌంట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత న్యూ మీద క్లిక్ చేసి ఈమెయిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత మీరు పంప‌బోయే మెయిల్ అడ్రెస్‌ను టైప్ చేయాలి. ఒక జీమెయిల్ అకౌంట్ యాడ్ అయిన త‌ర్వాత మ‌ళ్లీ ఇవే స్టెప్స్ రిపీట్ చేసి మ‌రో జీమెయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఏ మెయిల్ నుంచి బ‌ల్క్‌గా పంపాల‌న‌కుంటున్నారో దాన్ని ఓపెన్ చేసి ఆ త‌ర్వాత మీరు పంపే ఈమెయిల్ సెల‌క్ట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత హై లెట్ అయ్యే ఈమెయిల్స్‌ను బ‌ల్క్‌గా సెల‌క్ట్ చేసుకోవాలి.  మూవ్ మీద క్లిక్ చేయాలి. సింక్ర‌నైజ్ అయ్యే వ‌ర‌కు వెయిట్ చేయాలి.

Transfer Email Two Gmail Accounts