డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైల్‌వైర్ వైఫై సర్వీస్ ప్రాజెక్ట్‌ని ప్రారంభిన సంగతి అందరికీ తెలిసిందే. రైల్వే ప్రయాణికుల కోసం గూగుల్ సహకారంతో భారతీయ రైల్వే చేపట్టిన ఉచిత వైఫై సర్వీస్ గా దీన్ని చెప్పుకోవచ్చు. భారతీయ రైల్వేకు చెందిన టెలికామ్ కంపెనీ రైల్‌టెల్ ఈ ఉచిత సర్వీసులను అందిస్తోంది. ప్రస్తుతం 1600 పైగా రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందుతున్నాయి. కాగా రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవల్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఫ్రీ వైఫై ఎలా ఉపయోగించుకోవాలో ఓ సారి చూద్దాం.
మీరు ఏదైనా రైల్వే స్టేషన్‌కు వెళ్తే అక్కడ రైల్‌వైర్ వైఫై సర్వీస్ ఉందో లేదో తెలుసుకోండి. రైల్‌వైర్ వైఫై సర్వీస్ ఉంటే మీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్‌లో వైఫై సెట్టింగ్స్ ఆన్ చేయండి.
అక్కడ వైఫై అందుబాటులో ఉంటే RailWire Wi-Fi SSID అని వైఫైలో కనిపిస్తుంది. మీరు RailWire వైఫై పైన క్లిక్ చేస్తే ఓ నోటిఫికేషన్ వస్తుంది.నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే గూగుల్ రైల్వే సర్వీస్ వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత టాప్ రైట్ కార్నర్‌లో స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి.ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి కనెక్ట్ పైన క్లిక్ చేయాలి. మీ డివైజ్‌లో RailWire Wi-Fi కనెక్ట్ అవుతుంది. మీరు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు.మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరోసారి ఏ రైల్వేస్టేషన్‌లో మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కేవలం వైఫై ఆన్ చేస్తే చాలు. ఆటోమెటిక్‌గా రైల్‌వైర్ వైఫై కనెక్ట్ అవుతుంది.రైల్‌వైర్ వైఫై హాట్‌స్పాట్‌ను 30 నిమిషాల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఒకరు 350 ఎంబీ డేటా మాత్రమే ఉచితంగా ఉపయోగించుకోగలరు.
à°¨à±à°¯à±‚సౠటెకà±à°¨à°¾à°²à°œà±€ రైలà±à°µà±‡ వైఫై రైలà±à°µà±‡ వైఫై ఇండియనౠరైలà±à°µà±‡ à°à°¾à°°à°¤ రైలà±à°µà±‡ గూగà±à°²à± రైలౠటెలà±