వాట్సాప్‌లో గ్రూప్ చాట్‌కు ప్రైవేట్‌గా రిప్లే ఇవ్వడం ఎలా?

స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతిఒక్కరికీ వాట్సాప్ చేరువైంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చూపంతా వాట్సాప్ వైపే ఉంటుంది. వాట్సాప్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఆఫీస్ అంటూ ఇలా రకరకాల గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేస్తుంటారు. అయితే గ్రూపులో చాటింగ్ చేస్తూ..ఒక్కొక్కరు రిప్లే ఇస్తుంటారు. ఎవరైనా మీకు సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు...మీకు గ్రూప్ లో రిప్లే ఇవ్వడం ఇష్టం లేదనుకోండి... ప్రైవేట్‌గా రిప్లే ఇవ్వవచ్చు. అదేలాగో చూడండి.

 ప్రైవేట్‌గా రిప్లే ఇవ్వడం....

వాట్సాప్ గ్రూప్ చాట్ నుంచి ప్రైవేట్‌గా  రిప్లే ఇవ్వడానికి ఎలాంటి యాప్ అవసరం లేదు. ఒక సులభమైన మార్గం ద్వారా రిప్లే ఇవ్వవచ్చు. ఇది వాట్సాప్ లో ఇన్ బిల్ట్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ గ్రూప్  లో చాట్ చూస్తుంటే పర్సనల్ గా రిప్లే ఇవ్వడానికి సహాయపడుతుంది. 

1. మీ వాట్సాప్ గ్రూప్ చాట్ ను ఓపెన్ చేయండి. 
2.మీరు ఏ మెసేజ్ కు అయితే రిప్లే ఇవ్వాలనుకుంటారో...ఆ మెసేజ్ పై నొక్కి పట్టుకోండి
3. ఇప్పుడు 3 డాట్ మెనూని సెలక్ట్ చేసుకోండి. 
4. అందులో రిప్లే ప్రైవేట్లీ అనే ఆప్షన్ కనపడుతుంది. దానిపై ప్రెస్ చేస్తే చాలు...మీరు పంపించాల్సిన వారికి చేరుతుంది. ఇలా మీకు కావాల్సిన వారికి త్వరగా మెసేజ్ పంపించవచ్చు. 
 

వాట్సాప్ గ్రూప్ చాట్ ప్రైవేట్ మెసేజ్ whatsapp group chat private message