మనం ఎక్కువగా వినియోగించే సామాజిక మాధ్యమాల్లో వాట్సప్ ఒకటి. మెసేజింగ్ కోసం ఈ సోషల్ మీడియా సైట్‌ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.6 బిలియన్ల యూజర్లు వాట్సప్‌ని యూజ్ చేస్తున్నారంటేనే దీని ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చు. మనం రోజువారీ చేసే చాట్స్‌లో చాలా ముఖ్యమైనవి కూడా ఉంటాయి. మరి వీటిని భవిష్యత్ అవసరాల కోసం ఉంచుకోవడం ఎలా? అసలు వాట్సప్ చాట్‌ని పీడీఎఫ్‌లా మార్చుకోవడం ఎలా?
అవసరాలెన్నో..
న్యాయపరమైన అవసరాల కోసం వాట్సప్ చాలా కీలకం అవుతుంది. సాక్ష్యాల కోసం కూడా ఈ చాట్‌ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని ప్రూప్ ఆఫ్ క్లయిమ్‌గా వాడుకుంటారు. అందుకోసం వాట్సప్ చాట్‌ని ఇమేజస్‌గా తీసుకుని పీడీఎఫ్‌గా మార్చుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. పీడీఎఫ్‌గా ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే ఇది టైమ్ స్టాంప్‌లా యూజ్ అవుతుంది. ఇదొక్కటే కాదు కస్టమర్లతో జరిపిన చాట్‌ని బిజినెస్ అవసరాల కోసం కూడా వాడుకుంటారు. రీసెర్చ్ పర్పస్ కూడా యూజ్ చేసుకుంటారు. గూగుల్ డ్రైవ్ లాంటి వాటిలో ఈ చాట్స్‌నే యూజ్ చేసుకుంటారు.
ఎక్స్‌పోర్ట్ చేయండిలా..
వాట్సప్ చాట్‌ని పీడీఎఫ్‌లా ఎక్స్‌పోర్ట్ చేయడం కోసం ముందుగా ఏ చాట్‌ని ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్‌లోకి వెళ్లాలి. త్రి డాట్ మెనూ మీద క్లిక్ చేయాలి. మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత జీమెయిల్ ఎంచుకుని.. ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చి ఒకే చేయాలి. ఆ తర్వాత మీ సిస్టమ్‌లోకి ఈ టెక్ట్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. డబ్ల్యూపీఎస్ ఆఫీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులో మీ టెక్ట్ ఫైల్ ఓపెన్ చేయాలి. తర్వాత ఎక్స్‌పోర్ట్ యాజ్ పీడీఎఫ్ ఆప్షన్ క్లిక్ చేసి మీ ఫైల్‌ని పీడీఎఫ్‌గా మార్చుకోవాలి.
Export WhatsApp Chat PDF