వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు ఆన్ లైన్ లో డొనేట్ చేయడం ఎలా?

జమ్ముకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన వీర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు జాతియావత్తు ముందుకొస్తుంది.  40మంది జవాన్ల త్యాగానికి భారతావని సెల్యూట్ చేస్తోంది. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. దీనికోసం కేంద్రహోంశాఖ భారత్ కే వీర్ డాట్ కామ్ అనే పోర్టల్ ను రూపొందించింది. bharatkeveer.gov.inఈ పోర్టల్ ద్వారా అమరవీరులకు కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం అందించవచ్చు. 

ఈ వెబ్ సైట్లో అమరులైన జవాన్ల వివరాలతోపాటు బ్యాంక్ అకౌంట్లను పొందుపరిచారు. అమరులకే కాకుండా వీర జవాన్ల సంక్షేమం కోసం ఉద్దేశించిన భారత వీరుల కార్పస్ ఫండ్ అనే సెగ్మెంట్ కూడా ఉంది. అందులో డబ్బులు జమ చేయవచ్చు. ఎంతమంది వీరజవానులకైనా డబ్బులు పంపించవచ్చు. 

భారత్ కే వీర్ డాట్ అనే పోర్టల్ ద్వారా  అధిక సంఖ్యలో డబ్బులు జమ చేస్తుంటారు. ఈ సమయంలో సర్వర్ నెమ్మదిగా పనిచేస్తుంది. మీరు పంపించాలనుకున్న డబ్బును SBI యుపిఐ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పంపించవచ్చు. SBI లేదా  UPI లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపించిన విరాళాలు అన్ని కూడా భారత్ కే వీర్ కార్పస్ ఫండుకు పంపించబడుతాయి. అక్కడి నుంచి అమరవీరకుటుంబాలకు పంపిణీ చేయబడుతాయి. 

అమరవీరుల కుటుంబాలకు నెట్ బ్యాంకింగ్ ద్వారా విరాళాలు పంపించాలనుకుంటే....మీ SBI నెట్ బ్యాంకింగ్ ఖాతాను లాగిన్ చేయండి. చెల్లింపులు, బదిలీలు ట్యాబ్ పై క్లిక్ చేయండి. విరాళాలపై ఇతర చెల్లింపులపై క్లిక్ చేయండి. డ్రాప్ డ్రౌన్ మెనూ నుంచి భారత్ కే వీర్ ను సెలక్ట్ చేసుకోండి. మీ పేరు, చిరునామాతో వివరాలను నమోదు చేయండి. మీరు నేరుగా ఎంత డబ్బును పంపించాలనుకున్నారో చెల్లించండి. 

ఇక SBI కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లు భారత్ కే వీర్ కు డబ్బులు చెల్లించాలనుకుంటే వివరాలు
ఖాతా పేరు- భారత్ కే వీర్
అకౌంట్ నెంబర్ - 36724508925
బ్రాంచ్- న్యూఢిల్లీ 
ఢిల్లీ ప్రధాన బ్రాంచ్ (0691), 
IFCS కోడ్- SBIN0000691 

ఈ పోర్టల్ ద్వారా పంపించే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది. 

భారత్ కే వీర్ సీఆర్పీఎఫ్ విరాళాలు పుల్వామా దాడి ఎస్ బిఐ యుపిఐ bharat ke veer crpf donation pulwama attack sbi upi