భారత్‌లో ఇప్పుడు చైనా ఫోన్లదే రాజ్యం.. షియోమి, రెడ్‌మి, ఒప్పో, వివో, రియల్ మీ లాంటి ఫోన్లను జనం బాగా యూజ్ చేస్తున్నారు. అయితే ఈ ఫోన్ల సాయంతో ఇంటర్నెట్ లేకుండా ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయచ్చన్న సంగతి తెలుసా? అది కూడా 20 ఎంబీపీఎస్ స్సీడ్‌తో మీరు ఈ ఫైల్స్‌ని పంపొచ్చన్న సంగతి విన్నారా.. అదెలాగో చూద్దామా..
ఇంటర్ ట్రాన్స్‌ఫర్ అలెయన్స్
షియోమి కంపెనీ ఇటీవలే ఇంటర్ ట్రాన్సఫర్ అలయెన్స్ గ్రూప్ అనే ఆప్షన్‌ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సర్వీసులో ఒప్పో, వివో కూడా చేరాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న యూజర్లు డేటా, ఫైల్స్‌ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అది కూడా ఇంటర్నెట్ ప్రత్యేకండా లేకుండానే! త్వరలోనే రియల్‌మీ, రెడ్‌మి కూడా ఈ సేవలను అందించేందుకు సిద్ధం అవుతున్నాయి.
ఏంటి దీని ప్రత్యేకత?
మీ ఫోన్లో ఎలాంటి ఇంటర్నెట్ ప్యాక్ లేకపోయినా లేదా వైఫై అందుబాటులో లేకపోయినా ఫర్వాలేదు. ఈ మూడు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల ద్వారా మీరు 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ అలెయన్స్ మీ ఫోన్లో ఉన్న బ్లూ టూత్‌ని మీడియంగా చేసుకుని ఫైల్స్ ట్రాన్సఫర్ చేస్తుంది. సాంగ్స్, మూవీస్, వీడియోస్ లాంటి వాటిని కూడా ఇది ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు పంపిస్తుంది. 720పీ మూవీ కూడా సులభంగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అది కేవలం 20 నిమిషాల్లోనే! యాపిల్ ఫోన్‌లో ఎయిర్ డ్రాప్ అనే ఫీచర్ మాదిరే ఇది పని చేస్తుంది. ఎయిర్ డ్రాప్ ద్వారా ఇంటర్నెట్ లేకుండా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
Xiaomi Redmi Oppo Realme Vivo Transfer Files Internet 20 Mbps Speed